ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ హవా తెలంగాణలో నడిచినప్పుడు ఖమ్మం జిల్లాలో చక్రం తిప్పిన కీలక నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు( Thummala Nageswara Rao ) రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం అగమ్యగోచరంగా మారినట్లుగా తెలుస్తుంది .తెలంగాణ విభజన తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో అదికార బారాసలో చేరిన తుమ్మల 2018 జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధి ఉపేందర్ రెడ్డి పై ఓడిపోయారు.
రాష్ట్రమంతాబారసా గాలి వీస్తున్న సమయంలో ఆయన ఓడిపోవడంతో బారాశా లో ఆయనకు ప్రాధాన్యం క్రమం గా తగ్గుతూ వచ్చింది .అంతేకాకుండా ఈయనపై గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి కూడా బారాసలో జాయిన్ అవ్వడంతో ప్రాధాన్యతా క్రమంలో ఈయన స్థానం ప్రశ్నార్ధకం గా మారింది.

నియోజకవర్గం అంతా పట్టు ఉన్న కీలక నాయకుడైన ఈయనకు బారాశా మొదట్లో తగిన ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ మారిన పరిస్థితుల నడుమ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈయనను సైడ్ లైన్ చేసేసారు అని టాక్ .అయితే మరో మూడు నెలల్లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో మరోసారి సీటు పై ఆశ పెట్టుకున్న తుమ్మలకుచుక్కేదురయింది.రిలీజ్ చేసిన జాబితాలో కాంగ్రెస్ నుంచి పార్టీలో జాయిన్ అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి( K Upender Reddy ) కేసీఆర్ సీటు ప్రకటించారు దాంతో ఇప్పుడు పొలిటికల్ గా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనిస్థితి లో తుమ్మల ఉన్నట్లు గా ప్రచారం జరుగుతుంది .

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కూడా బలంగానే ఉన్నప్పటికీ అందులో చేరే పరిస్థితి తుమ్మలకు లేదు ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు షర్మిల ( Y.S.Sharmila )పాలేరు స్థానంపై కర్చీఫ్ వేసి ఉండటంతో తుమ్మలకు హామీ ఇచ్చే స్థితిలో కాంగ్రెస్ లేకపోవడం భాజపాల్లో జాయిన్ అవుదాం అనుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో భాజాపాకు అక్కడ బలం లేకపోవడంతో సొంత బలంపై ఆధారపడాల్సిన పరిస్థితిలో ఉండడంతో ఆయన రాజకీయ భవిష్య అ గమ్య గోచరంగా మారినట్టు తెలుస్తుంది .ఒకప్పుడు తన అనుకున్నదే నిర్ణయంగా చక్రం చెప్పిన తుమ్మల నేడు సాధారణ నాయకుడిగా మిగిలిపోవడం విది విచిత్రమనే చెప్పాలి
.






