శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. పెరగనున్న వాటి ధరలు.!

శ్రీవారి భక్తులకు ఒక ముఖ్యమైన అలర్ట్.ఇక నుంచి శ్రీవారి ప్రసాదం రేట్లు భారీగా పెరగనున్నాయి.

ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అధికారికంగా ప్రకటించారు.పెరిగిన శ్రీవారి ప్రసాదం ధరల విషయానికి వస్తే తిరుపతిలో భక్తులకు ప్రసాదంగా అందించే జిలేబీ రేట్లు గతంలో రూ.100 కు అందుబాటులో ఉండేవి.కానీ ప్రస్తుతం జిలేబి రేటు ఏకంగా రూ.500లకు పెరిగినట్లు దేవస్థానం వారు తెలిపారు.అయితే శ్రీవారి అర్జిత సేవలను తిరిగి ప్రారంభించిన తర్వాత ఈ ప్రసాదం రేట్లు పెరగడం గమనార్హం అనే చెప్పాలి.

కాగా ఈ గురువారం మాత్రం భక్తులకు ఓపెన్‌ కౌంటర్ల ద్వారా ప్రత్యేకంగా ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.ఒకానొక సమయంలో అంటే 2021 జూన్‌లో బ్లాక్‌ మార్కెట్‌లో ఈ ప్రసాదాన్ని ఏకంగా రెండు వేల రూపాయలకు అమ్మిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అక్రమ పంపిణీ దారులను అరికట్టే క్రమంలో ధరలను పెంచాలని టీటీడీ ఉన్నతాధికారులు ట్రస్ట్‌ బోర్డుకు ప్రతిపాదనలు చేయగా చర్చల అనంతరం ప్రసాదం రేట్లను రూ.500లకు పెంచుతున్నట్లు టీటీడీ ట్రస్ట్‌ బోర్డు వెల్లడించింది.దీంతో శ్రీవారి దేవస్థానం ఆదాయం 239 శాతం పెరగనుంది.

ఇలా ప్రసాదం రేట్లను పెంచడం అనేది లాభాపేక్షతో కూడిన ఆలోచన అని ఏపీ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు.

Ttd Take Key Decision Ttd, Key Decision, Good News, Prasad, Rates , Jilabe R
Advertisement
TTD Take Key Decision TTD, Key Decision, Good News, Prasad, Rates , Jilabe R

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల్లో తిరుపతి దేవస్థానం ఎంతగానో ప్రాచుర్యం పొందింది.కానీ శ్రీవారి ఆలయంలో సబ్సిడీకి ప్రసాదాలను పంపిణీ చేయాల్సింది మానేసి ధరలను పెంచి ఇంకా దేవాదాయ ఆదాయాన్ని పెంచాలని, ప్రజల సొమ్ముతో లాభం పొందాలని చూస్తోందని విమర్శలు చేశారు.నిజానికి శ్రీవారి ప్రసాదం తయారీ ఖర్చు కంటే ప్రసాదం ధరలే ఎక్కువగా ఉన్నాయని, ఇది చాలా అన్యాయమని అన్నారు.

అలాగే టీటీడీ మాజీ ట్రస్ట్ బోర్డు సబ్యుడు జి భానుప్రకాశ్‌ రెడ్డి కూడా శ్రీవారి ప్రసాదం ధరల పెంపును ఖండించారు.భక్తులకు సబ్సిడీపైనే ప్రసాదం పంపిణీ చెయ్యాలి అని డిమాండ్ చేశారు.

ఏకంగా ప్రసాదం ధరలను ఐదు రేట్లు పెంచడం సరికాదని తెలిపారు.

వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!
Advertisement

తాజా వార్తలు