తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శన సమయం మార్పునకు టీటీడీ కసరత్తు చేస్తోంది.దీనిని నవంబర్ 7, 8, 9 తేదీల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసే యోచనలో ఉంది.
ఈ క్రమంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య టీటీడీ అధికారులు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనున్నారు.అయితే, దీన్ని డిసెంబర్ నుంచి పూర్తిస్థాయిలో అమలుకు కసరత్తులు చేస్తున్నారు.
ఉదయం 10 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు అమలు చేస్తే ప్రముఖుల నుంచి కాటేజీల కోసం ఒత్తిడి తగ్గుతుందని టీటీడీ అంచనా వేస్తోంది.