దసరా పండుగను పురస్కరించుకుని ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ముందుగా టికెట్ బుక్ చేసుకుంటే వారికి పది శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
అక్టోబర్ 15 వ తేదీ నుంచి 29 తేదీల మధ్య రానుపోను ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు తిరుగు ప్రయాణంపై పది శాతం రాయితీ వర్తింపజేస్తామని టీఎస్ ఆర్టీసీ తెలిపింది.అయితే ఈనెల 30 లోపు టికెట్లు బుక్ చేసుకున్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
అదేవిధంగా రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్ని రకాల బస్సుల్లోనూ రాయితీ అమలు చేయనుంది.