రైతుల ఆత్మహత్యలపై చర్చ జరగాలని తెలంగాణా అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు కోరినందుకు స్పీకర్ సభను వాయిదా వేసారు.గంటో, రెండు గంటలో కాదు.
ఏకంగా సోమవారం వరకు వాయిదా వేసారు.స్పీకర్ మధుసూదనా చారి చర్యకు సభ్యులు ఆశ్చర్య పోయారు.
సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు.కాని సభ్యలు అభ్యంతరం వ్యక్తం చేసారు.
రైతుల ఆత్మహత్యల మీద చర్చ చేయాలని, రుణాల మాఫీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు.కాని స్పీకర్ సభ్యుల డిమాండును పట్టించుకోకుండా సభను వాయిదా వేసారు సభను వాయిదా వేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది.
అన్ని పార్టీల వారు అసెంబ్లీ బయట నిరసన ప్రదర్శన చేసారు.దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి నాంపల్లి పోలీసు స్టేషన్కు తరలించారు.
రైతుల ఆత్మహత్యల మీద ఎక్కువగా చర్చ చేయడం ప్రభుత్వానికి ఇష్టం లేదు.ప్రభుత్వం ఈ రోజు విద్యుత్ పై చర్చ జరపాలని అనుకుంది.
కాని సభ్యులు ఆత్మహత్యల మీద చర్చకు పట్టుబట్టారు కాని వారి కోరిక నెరవేరలేదు.







