పిల్లలు పుట్టాక మీ ముఖంలో మునుపటి గ్లో కనిపించడం లేదా.. వర్రీ వద్దు ఇది ట్రై చేయండి!

సాధారణంగా చాలామంది మహిళలు పిల్లలు పుట్టక ముందు ఒకలా పిల్లలు పుట్టాక మరోలా ఉంటారు.శారీరకంగా వారిలో ఎన్నో మార్పులు వస్తుంటాయి.

అలాగే పిల్లలు పుట్టిన తర్వాత ముఖంలో మునుపటి గ్లో ( Previous glow )అనేది కనిపించదు.దీని కారణంగా ఎంతో బాధపడుతూ ఉంటారు.

మీ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవకండి.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ మీరు అందంగా ఆకర్షణీయంగా మారవచ్చు.

మొదట మీకంటూ మీరు కొంత సమయాన్ని కేటాయించుకోవడం అలవాటు చేసుకోండి.హెల్తీ డైట్ ను మెయింటైన్ చేయండి.కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి.

Advertisement
Try This Home Remedy For Glowing Skin After Delivery! Home Remedy, Glowing Skin,

అలాగే చర్మ ఆరోగ్యం కోసం అప్పుడప్పుడు కొన్ని ఇంటి చిట్కాలను పాటించండి.ఇప్పుడు చెప్పబోయే రెమెడీ కూడా ఆ కోవకే చెందుతుంది.

ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆరెంజ్ పీల్ పౌడర్( Orange Peel Powder ), వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe vera gel ), వన్ టేబుల్ స్పూన్ హనీ( Honey ) మరియు సరిపడా రోజ్ వాటర్ వేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి.

Try This Home Remedy For Glowing Skin After Delivery Home Remedy, Glowing Skin,

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని పాటించడం వల్ల మీ స్కిన్ లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.

ఆరెంజ్ పీల్ పౌడర్ మీ చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది.ఆరెంజ్ పీల్ పౌడ‌ర్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ స్కిన్ డ్యామేజ్‌కు అడ్డుక‌ట్ట వేస్తాయి.అలాగే కాఫీ పౌడ‌ర్ లోని కెఫిన్ మచ్చలు, డార్క్ స్పాట్స్, సన్ స్పాట్‌లకు( caffeine spots, dark spots, sun spots ) వ్యతిరేకంగా పోరాడుతుంది.

న్యూస్ రౌండప్ టాప్ 20

పిగ్మెంటేషన్‌ను నివారిస్తుంది.మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మరియు బిగుతుగా మారుస్తుంది.

Try This Home Remedy For Glowing Skin After Delivery Home Remedy, Glowing Skin,
Advertisement

తేనె చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.అకాల వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.మొండి మొటిమ‌ల‌ను మాయం చేస్తుంది.

రోజ్ వాటర్ మీ చర్మాన్ని శుభ్రపరచడానికి మరియు అవాంఛిత మచ్చలను కలిగించే మలినాలను తొలగించడానికి స‌హాయ‌ప‌డుతుంది.ఇక అలోవెరా జెల్ స్కిన్ ను మాయిశ్చరైజింగ్ గా మారుస్తుంది.

ముడ‌త‌ల‌ను దూరం చేసి ముఖం కాంతివంతంగా మెరిసేలా ప్రోత్స‌హిస్తుంది.

తాజా వార్తలు