టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గత కొంతకాలంగా ఈమె మయోసైటిసిస్ వ్యాధితో బాధపడుతూ ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఇలా ఈమె కమిట్ అయిన సినిమాలకు కాస్త విరామం ఇచ్చి పూర్తిగా చికిత్స తీసుకొని ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి బయటపడిన సమంత తిరిగి తన సినిమా పనులతో బిజీగా మారిపోయినట్టు తెలుస్తుంది.ఇదివరకే ఈమె నటిస్తున్న సిటాడెల్ సిరీస్ లో పాల్గొన్నారు.
అలాగే విజయ్ దేవరకొండ ఖుషి సినిమా షూటింగ్లో కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది.

ఇలా వరుస సినిమాలతో తిరిగి ఎంతో బిజీగా మారినటువంటి సమంత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తన సినిమా విషయాలను మాత్రమే కాకుండా తరచూ మోటివేషనల్ కొటేషన్స్ షేర్ చేస్తూ ఉన్నారు.ఈ క్రమంలోనే తాజాగా సమంత అమ్మవారి ముందు కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ నమ్మకం గురించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే సమంత పోస్ట్ చేస్తూ.కొన్నిసార్లు అది మానవాతీత బలాన్ని ఏమాత్రం తీసుకోదు.కేవలం నమ్మకమే మిమ్మల్ని పొందుతుంది.విశ్వాసమే మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది.నమ్మకమే మీ గురువు.మీ స్నేహితుడిగా ఉంటుంది.
మిమ్మల్ని నమ్మకమే మానవతీతంగా చేస్తుంది అంటూ ఈ సందర్భంగా నమ్మకమే అన్నింటికీ మూలం అంటూ ఈమె లింగ బైరవి అమ్మవారి ఎదురుగా కూర్చుని ధ్యానం చేస్తున్న ఫోటోలు షేర్ చేశారు.ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ ఫోటో పై పలువురు నేటిజన్స్ స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.







