ప్రపంచ వ్యాప్తంగా నిన్నటి రోజున క్రైస్తవులందరూ తమ క్రిస్మస్ పండగను చేసుకుంటుంటే, అగ్ర రాజ్యం అధినేత ట్రంప్ మాత్రం.వైట్‌హౌస్‌లో ఏకాకిగా గడిపారు.
అసలు ట్రంప్ ఎక్కడికి వెళ్లకుండా అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని కేవలం వైట్ హౌస్ కి ఎందుకు పరిమితం అయ్యారు.అంటే ఒక ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది.
అదేంటంటే.ట్రంప్ ఎక్కడికి వెళ్ళకుండా తన చాంబర్ లోనే కూర్చుని

డెమోక్రాట్లను నిశితంగా విమర్శిస్తూ ట్వీట్లు చేశారట.మెక్సికన్లు అమెరికాలో చొరబడకుండా సరిహద్దు గోడ నిర్మిస్తానని ట్రంప్ ఎన్నికల సమయంలో అమెరికా ప్రజలకి హామీ ఇచ్చాడు.కాని ఇప్పుడు డెమోక్రాట్లు ట్రంప్ చర్యలకి అడ్డు పడటంతో ట్రంప్ ఆలోచనలకి బ్రేకులు పడినట్లుగా అయ్యింది.
ట్రంప్ ఏ విధంగానైనా గోడ నిర్మించేందుకు అవసరమైన చట్టసభల అనుమతి సంపాదించేందుకు కసరత్తు చేస్తున్నారు.కాని డెమోక్రాట్లు సహకరించడంలేదు.

దాంతో ట్రంప్ ఈ విధంగా ఒంటరిగానే గడుపుతూ శ్వేత సౌధంలో ఉండిపోయారని ట్వీట్ లతో కాలం గడిపారని వార్తలు వచ్చాయి.అయితే ట్రంప్ ఒక చర్చికి వెళ్లి కాసేపు గడిపి మళ్ళీ వైట్ హౌస్ కి వచ్చేశారని అధికారిక వర్గాలు తెలిపాయి.