అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎట్టకేలకి డెమొక్రాట్ల మోడీ వైఖరికి దిగిరాక తప్పలేదు.తానూ అమెరికా అధ్యక్షుడునని ఏదన్నా చేసేయచ్చునని దూకుడుగా ప్రవర్తించే ట్రంప్ కాళ్ళకి బ్రేకులు పడ్డాయి.
మెక్సికో అమరికా సరిహద్దు గోడ విషయంలో ఎంతో మొండిగా వ్యవహరిస్తున్న ట్రంప్ తన నిర్ణయంపై వెనకడుగు వేశారు.అక్రమ వలసలని అడ్డుకోవడానికి స్టీల్ గోడని అయినా సరే నిర్మించాలని వ్యాఖ్యానించారు.
అక్రమవలసదారలు కారణంగా అమెరికా ఆర్ధిక వ్వవస్థకు తీవ్రంగా నష్టం జరుగుతోందని ఆయన అన్నారు.స్టీల్ గోడలాంటి నిర్మాణంపై చర్చించేందుకు అమెరికా ఉక్కు పరిశ్రమ సంఘం అధ్యక్షుడితో పాటు ముఖ్యులతో సమావేశమవుతానని ట్రంప్ తెలిపారు.
గోడ కారణంగా అక్రమ వలసలతో పాటు మాదకద్రవ్యాల సరఫరాను అడ్డుకోవచ్చనీ, తద్వారా నేరాలు తగ్గుతాయని ఆయన అన్నారు.

వైట్‌హౌస్ నుంచి క్యాంప్ డేవిడ్‌కు బయలుదేరిన సందర్భంగా మీడియాతోమాట్లాడిన ట్రంప్.దాదాపు 3 వారాలుగా కొనసాగుతున్న షట్‌డౌన్ సుదీర్ఘకాలం సాగుతుందని ఆయన అన్నారు.గోడ నిర్మాణం విషయమై ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ.
మైనారిటీ నేతల చక్ గనుకా కలిసి వస్తే సమస్య వెంటనే పరిష్కారం అవుతుందని అన్నారు.అమెరికా స్థంబించి పోవడానికి వారిద్దరే కారం అంటూ మండిపడ్డారు.