రానున్న రోజుల్లో టీఆర్ఎస్ కు తప్పనితిప్పలు... ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఫలించేనా?

తెలంగాణలో రాజకీయాలు ప్రతి పక్షాల దూకుడుతో మరింతగా రోజు రోజుకు వేడెక్కుతున్న పరిస్థితి ఉంది.అయితే ఇప్పటికే రెండు దఫాలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ముచ్చటగా మూడో సారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న పరిస్థితి ఉంది.

 Trs Must Make Mistakes In The Coming Days  Will Prashant Kishore's Strategy Work-TeluguStop.com

అయితే గత రెండు దఫాలుగా ఉన్నటు వంటి రాజకీయ వాతావారణం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉండే అవకాశం వందకు వంద శాతం లేదు.అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మారాలనే ఉద్దేశ్యంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తూ క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత పెంచాలనే వ్యూహాన్ని బలంగా ప్రయోగిస్తున్న పరిస్థితి ఉంది.

అయితే టీఆర్ఎస్ ను ఎలాగైనా అధికారంలోకి రానివ్వద్దనే లక్ష్యంతో అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ తో కేసీఆర్ భేటీ తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ పర్యటన అనేది రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

అయితే రానున్న రోజుల్లో టీఆర్ఎస్ కు చిక్కులు తప్పేలా లేనట్లు తెలుస్తోంది.

అయితే టీఆర్ఎస్ పార్టీపరంగా కొంత సీట్లు తగ్గినా అధికారం మాత్రం ఖచ్చితంగా దక్కించుకుంటామనే నమ్మకం టీఆర్ఎస్ లో ఉంది.అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన నేపథ్యంలోనే రాష్ట్రంకు సంబంధించిన రాజకీయ వ్యూహాల కొరకు, గెలుపు  కొరకు ప్రశాంత్ కిషోర్ తో సంప్రదింపులు సహకారం కోరుతున్నట్టు తెలుస్తోంది.

అయితే టీఆర్ఎస్ మాత్రం ఇంకో ఇరవై సంవత్సరాలు అధికారంలో ఉంటామని ఖచ్చితంగా వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని చెబుతుండగా ప్రతిపక్షాలు మాత్రం టీఆర్ఎస్ కు ఇది చివరి బడ్జెట్ అని విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది.మరి మొట్టమొదటి సారిగా ప్రశాంత్ కిషోర్ తెలంగాణ రాజకీయాలలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఏ మేరకు అతని వ్యూహాలు ఫలిస్తాయనేది చూడాల్సి ఉంది.

TRS Must Make Mistakes In The Coming Days Will Prashant Kishores Strategy Work

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube