కొద్ది రోజులుగా కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంలోకి టీఆర్ఎస్ చేరుతుందని వార్తలు జోరుగా హల్‌చల్ చేస్తున్నాయి.టీఆర్ఎస్ కేంద్రంలో చేరితే ఆ పార్టీకి రెండు మంత్రి పదవులు వస్తాయని కూడా వార్తలు వస్తున్నాయి.
కేంద్రంలో టీఆర్ఎస్ నుంచి మంత్రి పదవుల రేసులో మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డితో పాటు నిజామాబాద్ ఎంపీ, కేసీఆర్ కుమార్తె కవిత, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ రేసులో ఉన్నారు.
ఈ ముగ్గురిలో ఇద్దరికి బెర్త్‌లు కన్‌ఫార్మ్ అన్న టాక్ ఉన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీజేపీ చేరితే ఇక్కడ ఆ పార్టీ కూడా రెండు మంత్రి పదవులు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ మేరకు బీజేపీ జాతీయ అధిష్టానంతో కేసీఆర్ చర్చలు జరిపినట్టు కూడా వార్తలు వస్తున్నాయి.
న్యూ ఇయర్‌లో జరిగే ఈ విస్తరణలో ముందుగా టీ ప్రభుత్వంలోని బీజేపీ చేరుతుందని, తర్వాత మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు ఎన్డీయేలో టీఆర్ఎస్ చేరుతుందని తెలుస్తోంది.ఏపీలోనూ ఇదే రకంగా బీజేపీ, టీడీపీ అధికారాన్ని పంచుకుంటుండటంతో… ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా అమలు చేయాలని బీజేపీ కోరిందట.
ఇక తెలంగాణలో బీజేపీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
వీరిలో మంత్రి పదవి రేసులో ఉన్నవారిలో నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ప్రభాకర్‌తో పాటు మండడలిలోని బీజేపీ సభ్యుడు రామచంద్రరావు ఇందుకోసం పోటీ పడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.వీరిలో ఇద్దరికి మాత్రమే బెర్త్ దక్కనుంది.
మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.







