ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) కాంబో అంటే ప్రేక్షకుల్లో అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరిపోయాయి.ఎందుకంటే ఈ కాంబోలో ఇప్పటికే ముచ్చటగా మూడు సినిమాలు రాగా మూడు కూడా సూపర్ హిట్ అయ్యాయి.
జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురము( Ala Vaikunthapurramuloo )లో సినిమాలు మూడు కూడా మంచి హిట్ అయ్యాయి.
ఇక ఈ హ్యాట్రిక్స్ హిట్ తర్వాత మరోసారి ఈ కాంబో ఇటీవలే అఫిషియల్ అయ్యింది.ఈ సినిమాను అఫిషియల్ గా ప్రకటించిన్నప్పటి నుండే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.ఇక ఈ సినిమా విషయంలో తాజాగా స్టోరీ గురించి ఒక అప్డేట్ వైరల్ అయ్యింది.
వచ్చే ఏడాది స్టార్ట్ కాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమా కాబట్టి కథ కూడా అందుకు తగ్గట్టుగానే త్రివిక్రమ్ సిద్ధం చేసినట్టు టాక్.
తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ భారత స్వాతంత్య ఉద్యమం నేపథ్యంలో జరిగే డ్రామా అని టాక్.స్టోరీ లైన్ నే ఇంత స్ట్రాంగ్ గా ఉంటే ఇక త్రివిక్రమ్ తన మేకింగ్ తో ఈ మూవీని ఏ రేంజ్ కు తీసుకు వెళతాడో వేచి చూడాలి.అంతేకాదు ఈ సినిమాకు ఏకంగా 300 కోట్ల బడ్జెట్ ను కూడా కేటాయించినట్టు తెలుస్తుంది.
మొత్తం మీద 4వ సారి రాబోతున్న ఈ కాంబోను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసినట్టే తెలుస్తుంది.కాగా ఈ సినిమాను గీతా ఆర్ట్స్ తో కలిసి హారిక హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందించనున్నాడు.
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2( Pushpa 2 ) చేస్తుండగా ఇది వచ్చే ఏడాది ఆగస్టు 15న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.అలాగే త్రివిక్రమ్ మహేష్ తో గుంటూరు కారం చేస్తుండగా.
ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.