తనతో డేటింగ్ చేసే ఆఫర్ ఇచ్చిన త్రిష... కండిషన్ అప్లై

లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితం అయిన సెలబ్రిటీలు ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల చాలెంజ్ లతో కాలక్షేపం చేస్తున్నారు.

సోషల్ యాక్టివిటీ కంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటానికి ఫ్యాన్స్ తో కబుర్లు చెప్పుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

కొంత మంది సెలబ్రిటీలు తమ సోషల్ యాక్టివిటీస్ లో భాగస్వామ్యం అవుతూ కరోనా కారణంగా లాక్ డౌన్ లో ఆకలితో అలమటిస్తున్న పేద, మధ్యతరగతి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఈ వరుసలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముందు వరుసలో ఉన్నాడు.

Trisha Gives Dating Offer To Her Fans, Tollywood, Telugu Cinema, Kollywood, Lock

అలాగే టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ తన గొప్ప మనసు చాటుకుంటున్నాడు.ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే గ్లామర్ కి, కాలక్షేపానికి, కబుర్లు చెప్పడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇప్పటికే మన అందాల భామలు సోషల్ మీడియాలో పేపర్ చాలెంజ్, పిల్లో చాలెంజ్ అంటూ హడావిడి చేస్తున్నారు.అయితే వీటి కంటే ఫ్యాన్స్ తో ఆడుకోవడం బెటర్ అని త్రిష అనుకుందేమో వారికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది.

Advertisement

ఇటీవ‌ల ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వ‌చ్చిన అమ్మ‌డు అభిమానుల‌కు ప్ర‌శ‌ల‌కు స‌మాధానం ఇచ్చింది.అభిమానుల‌కు ఓ బంఫ‌ర్ ఆఫ‌ర్ కూడా ఇచ్చింది.

సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్న‌ప్ప‌టికి నేను ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రితో డేటింగ్ చేయ‌లేదు. మీలో ఎవ‌రికైనా నాపై గ‌నుక ఇంట్రెస్ట్ ఉంటే నా స‌మ‌యాన్ని వృథా చేయ‌కుండా న‌న్ను ఎంత బాగా చూసుకుంటారో తెలియ‌జేస్తూ 500 ప‌దాల‌తో ఓ వ్యాసం రాసి ఇంప్రెస్ చేయండి.

ఆ వ్యాసం గ‌నుక న‌న్ను ఇంప్రెస్ చేస్తే ఇక మీపంట పండిన‌ట్లేన‌ని చెప్పింది.నాతో డేటింగ్ చేసే అవకాశం వాళ్ళకి ఇస్తానని ఆఫర్ కూడా ఇచ్చింది.

మరి ఈ ఆఫర్ కాస్తా ఇంటరెస్టింగ్ గా ఉందని ఆమె కోసం ఎంత మంది ట్రై చేస్తారో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నయా లుక్ వైరల్.. ఈ లుక్ మాత్రం అదిరిపోయిందిగా!
Advertisement

తాజా వార్తలు