కరోనాతో తృణమూల్ పార్టీ ఎమ్మెల్యే మృతి

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తాండవిస్తోంది.రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.

 West Bengal, Mla Samaresh Das, Dead, Corona-TeluguStop.com

వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి.రాష్ట్రాల్లో కరోనాతో పరిస్థితి దారుణంగా మారింది.

కరోనా బారిన పడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.సామాన్య ప్రజలతో రాజకీయ నాయకుల్లో కూడా ప్రాణ భయం నెలకొంది.

కరోనాతో రాజీకీయ నాయకులు చనిపోతుడటంతో అందరూ భయాందోళనకు గురవుతున్నారు.పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సోమవారం మరో ఎమ్మెల్యే కరోనాతో మృతి చెందాడు.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సమరేష్ దాస్ (76) కరోనాతో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం (సోమవారం) మరణించాడు.ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా ఈగ్రా నియోజకవర్గ ఎమ్మేల్యే అయిన సమరేష్ దాస్ గత కొంత కాలంగా కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు.

ఈ క్రమంలో కరోనా పరీక్షలు నిర్వహించగా రిపోర్టుల్లో కరోనా పాజిటివ్ వచ్చింది.దీంతో ఆయన అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నాడు.పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఉదయాన్నే ఆయన ప్రాణాలు కోల్పోయాడు.దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు చేరింది.

ఎమ్మెల్యే మరణ వార్త విని సీఎం మమతా బెనర్జీతో పాటు పలువురు పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube