నిఖిల్, చందూ మొండేటి ‘కార్తికేయ 2’ ట్రైలర్‌కు అనూహ్య స్పందన..

ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి.క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్‌పై టి.

 Tremendous Response For Nikhil Karthikeya 2 Movie Trailer Details, Tremendous Re-TeluguStop.com

జి.విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.తాజా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ ఆకట్టుకుంటుంది.5 సహస్రాల ముందే పలికిన ప్రమాదం.ప్రమాదం లిఖితం.

పరిష్కారం లిఖితం.ఏ ప్రశ్న అయినా నా దగ్గరికి రానంతవరకే.

వస్తే అది సమస్య కాదు.సమాధానం.

అంటూ సాగే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

కాలభైరవ బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు అదనపు ఆకర్షణ.

ప్రతీ ఫ్రేమ్ చాలా అద్భుతంగా చూపించారు సినిమాటోగ్రఫర్ కార్తికే ఘట్టమనేని.టెక్నీషియన్స్‌తో అద్బుతమైన ఔట్ పుట్ తీసుకున్నారు దర్శకుడు చందూ మొండేటి.

కార్తికేయకు సీక్వెల్‌గా వస్తున్న కార్తికేయ 2 అంచనాలు అందుకోవడం కాదు.మంచిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు చందూ.

ఈ సినిమా అత్యద్భుతమైన విజువల్ ఫీస్టుగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది.ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.

నిఖిల్ కి జంట‌గా న‌టిస్తుంది.ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో ఆసక్తికరమైన విషయం డాక్ట‌ర్ కార్తికేయ ప్ర‌యాణం.శ్రీకృష్ణుడు చ‌రిత్ర‌లోకి ఎంట‌ర‌వుతూ క‌నిపిస్తున్నారు ఈయన.ఈ చిత్రంలోని భావాన్ని ట్రైలర్ రూపంలో ద‌ర్శ‌కుడు చందు మొండేటి ప్రేక్ష‌కుల క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు.అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఆగస్ట్ 13న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది కార్తికేయ 2.

నటీనటులు:

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ తదితరులు.

టెక్నికల్ టీం:

క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్యం – చందు మెుండేటి బ్యాన‌ర్: పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రి& అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌ కొ-ప్రొడ్యూస‌ర్: వివేక్ కూచిభొట్లనిర్మాత‌లు: టి.జి విశ్వ ప్ర‌సాద్‌&అభిషేక్ అగ‌ర్వాల్‌ మ్యూజిక్: కాలభైరవ సినిమాటోగ్రాఫర్: కార్తీక్ ఘట్టమనేని ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్ పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube