టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో ( Houston ) ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.తైలా స్మిత్( Tayla Smith ) అనే 22 ఏళ్ల ట్రాన్స్‌జెండర్ మహిళ గొంతు కోతి హత్య చేసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు.
అదృష్టవశాత్తు ఆమె అతడితో పోరాడి ఆ ప్రమోదం నుంచి తప్పించుకోగలిగింది.డేటింగ్ యాప్‌లో( Dating App ) పరిచయమైన వ్యక్తితో ఆమె ఫస్ట్ డేట్ ప్లాన్ చేసింది.
ఆమెపై హత్యాయత్నం చేసిన వ్యక్తి పేరు కోర్డెల్ స్టీవర్ట్ (24). ఆమె లింగమార్పిడి గురించి ముందే తెలిసినప్పటికీ, అతను ఆమెతో బాగా మాట్లాడాడు.
తనంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు.తర్వాత మొదటి డేటింగ్ సమయంలో కత్తితో ఆమె గొంతు కోశాడు.
తాము సినిమా చూస్తూ డిన్నర్ చేస్తున్న సమయంలో స్టీవర్ట్ ( Kordel Stewart ) తనపై అనూహ్యంగా దాడి చేశాడని తైలా స్మిత్ తెలిపింది.నిందితుడు తన షార్ట్‌లో దాచుకున్న కత్తితో ఆమె నోరు మూసి గొంతు కోశాడు.
స్మిత్ తన ప్రాణాలకు తెగించి అతని నుండి కత్తితో పోరాడగలిగింది.ఆమెకు తీవ్ర గాయాలైనప్పటికీ దాడి నుంచి బయటపడింది.

పోలీసులు స్టీవర్ట్‌ను అరెస్టు చేసి, ఘోరమైన ఆయుధంతో తీవ్రమైన దాడికి పాల్పడినట్లు కేసు ఫైల్ చేశారు.అతను ప్రస్తుతం 1,25,000 డాలర్ల బాండ్‌తో హారిస్ కౌంటీ జైలులో( Harris County Jail ) ఉన్నాడు.అతను హింసాత్మక చరిత్రను కూడా కలిగి ఉన్నాడు, ఇందులో 2020 హత్యాచార నేరారోపణ కూడా ఉంది.ఒక సాక్షి నిజం చెప్పకపోవడం వల్ల అతడు ఆ నేరం నుంచి బయటపడగలిగాడు.

UCLA స్కూల్ ఆఫ్ లాలోని విలియమ్స్ ఇన్‌స్టిట్యూట్ 2021 అధ్యయనం ప్రకారం, సిస్జెండర్ వ్యక్తుల కంటే లింగమార్పిడి వ్యక్తులు హింసాత్మక నేరాలకు గురయ్యే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువ.స్మిత్ తన లింగమార్పిడి గుర్తింపు మాత్రమే దాడికి కారణమని తాను భావించడం లేదని చెప్పింది, స్టీవర్ట్ ఉద్దేశాల గురించి తాను ఇప్పటికీ గందరగోళంగా ఉన్నానని తెలిపింది.తాను ట్రాన్స్‌జెండర్( Transgender ) అని తన డేటింగ్ పార్ట్‌నర్స్‌కు ఎప్పుడూ చెబుతుంటానని, స్టీవర్ట్‌తో కూడా ఆ సంగతి తెలిపానని ఆమె చెప్పింది.కేసు కొనసాగుతుండగా, స్మిత్ గాయాల నుండి కోలుకుంటోంది.
ఆమె గాయాలకు కుట్లు పడ్డాయి.







