కోనసీమ జిల్లాలో విషాదం నెలకొంది.ఆన్ లైన్ గేమ్స్ ఆడి డబ్బును పొగొట్టుకున్న యువకుడు బలవన్మరణం చెందాడు.
ఈ ఘటన కొత్తపేట మండలం గంటిపల్లిపాలెంలో చోటు చేసుకుంది.మృతుడు చీకరమెల్లి సాధ్విక్ గా గుర్తించారు.తాత ఆస్పత్రి ఖర్చుల కోసం రూ.78 వేలను మేనత్త పంపింది.అయితే ఆన్ లైన్ గేమ్స్ ఆడిన సాధ్విక్ డబ్బును పొగొట్టుకున్నాడు.ఈ క్రమంలోనే తాత ఆపరేషన్ కోసం తిరిగి డబ్బులు ఎలా తేవాలో తెలియక తీవ్ర మనస్థాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.







