కొందరి మరణాలు జాలి కలిగేలా చేస్తాయి.చెప్పిరాని మృత్యువు చటుక్కున కళ్లముందే మనిషి ప్రాణం తీస్తుంటే, చూడటం తప్ప ఏం చేయలేని దుస్దితి.
ఇలాగే పాపం ఓ ఉపాధ్యాయురాలు మరణించింది.అది విధి నిర్వహణలో మరణించడం విషాదం.
ఆ వివరాలు తెలుసుకుంటే.
ఏపీ లోని తూర్పు గోదావరి జిల్లాలో పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న, కృపావతి అనే ఉపాధ్యాయురాలు అస్వస్థతకు గురై మృతి చెందారు.
కాగా కృపావతి చింతూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పోలింగ్ లో అసిస్టెంట్ ఆఫీసర్ గా విధుల్లో ఉండగా ఈ సంఘటన జరగడం విచారకరం.
ఇకపోతే అనుకోకుండా అస్వస్థతకు గురైన కృపావతిని, చికిత్స నిమిత్తం వెంటనే చింతూరు నుంచి రంపచోడవరం తరలించారు.
అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే కృపావతి మృతిచెందారు.ఇకపోతే కాకినాడలోని పర్లవపేట మున్సిపల్ పాఠశాలలో కృపావతి టీచర్ గా పనిచేస్తున్నారట.
ఇక ఈమె మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారట అధికారులు.







