తిరుప‌తి స్విమ్స్ ఆసుప‌త్రిలో విషాదం.. !

కరోనా వైరస్ ఎన్ని జీవితాలను చిదిమేసిందో, ఎందరి బ్రతుకులను ఆగం చేసిందో, ఒక్కో కుంటుంబం లోని కన్నీటి బాధలకు చలించని మనస్సులుండవు.

మంచి వారు చెడ్ద వారు అనే తారతమ్యాలు లేకుండా ప్రపంచాన్ని శ్మశానంగా మార్చేసింది.

ఎందరినో అనాధలుగా రోడ్డు మీదకు లాగింది.ఇక ప్రాణాలకు తెగించి కరోనాకు వైద్యం అందించిన వైద్య సిబ్బందిని కూడా బలితీసుకుంది ఈ మాయదారి రోగం.

Nellore, Nurses, Covid-19, Suicide, Tirupati, Svims Hospital -తిరుప�

ముఖ్యంగా భయం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారట.ఇకపోతే తిరుప‌తి స్విమ్స్ ఆసుప‌త్రిలో విషాదం చోటు చేసుకుంది.

నెల్లూరు జిల్లాలో న‌ర్స్‌గా బాధ్య‌తలు నిర్వ‌హిస్తున్న జ‌యమ్మ అనే మ‌హిళకు బ్లాక్ ఫంగ‌స్ సోకడంతో తిరుప‌తి స్విమ్స్‌లో చికిత్స అందిస్తున్నారట.ఈ క్రమంలో భయాందోళనలకు గురైన జ‌యమ్మ చికిత్స పొందుతున్న కరోనా వార్డులోనే ఉరేసుకొని ఆత్మహత్య‌కు పాల్ప‌డ్డారట.

Advertisement

కాగా ఈ ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారట.ఏది ఏమైనా ఈ సమయంలో మానసిక స్దైర్యం అనేది చాలా ముఖ్యం.

బలహీనపడిన మనస్సులోకి మృత్యువు అవలీలగా ప్రవేశిస్తుంది.కాబట్టి మరణం ఎప్పుడైనా తప్పదు అనే నిశ్చయంతో ధైర్యంగా ఉండటం అలవాటు చేసుకుంటే మంచింది.

Advertisement

తాజా వార్తలు