హైదరాబాద్‎లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం

హైదరాబాద్ గాంధీభవన్ లో తెలంగాణ పీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది.

హాత్ సే హాత్ జోడో అభియాన్ తో పాటు రేవంత్ పాదయాత్రపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని భావిస్తోన్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ విషయాన్ని రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే దృష్టికి తీసుకెళ్లారు.

కాగా ఈ సమావేశంల రేవంత్ రెడ్డి పాదయాత్రపై సీనియర్ నేతల అభిప్రాయాలను ఠాక్రే తీసుకోనున్నారు.అయితే రేవంత్ రెడ్డి ఒక్కరే పాదయాత్ర చేస్తారా.

లేక సీనియర్లతో కలిసి చేస్తారా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.

Advertisement
Garam masala : భారతీయులు ఉపయోగించే గరం మసాలాతో.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..!

తాజా వార్తలు