కేసీఆర్ ప్రభుత్వంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.సర్పంచ్ నిధులను ప్రభుత్వం దొంగిలించిందని ఆరోపించారు.
ఈ క్రమంలో నిధులు కాజేసిన సర్కార్ పై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.బిల్లులు రాకపోవడంతో సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.
నిధులు లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి జరగడం లేదని పేర్కొన్నారు.న్యాయం కోసం పోరాడేందుకు వెళ్తుంటే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు సర్పంచులకు మద్ధతు తెలిపిన తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు దిగిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే ఇందిరాపార్క్ కు వెళ్తున్న రేవంత్ రెడ్డిని బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేశారు.