రేవంత్ రెడ్డి కామెంట్స్.ప్రధాని అనాలోచితా నిర్ణయం వల్ల లక్షలాది మంది యువకులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపట్టారు.
దేశ వ్యాప్తంగా 18 నుండి 25 ఏళ్ల లోపు ఉన్న 25 కోట్లు మంది యువకులు ప్రధానిగా మోడీ నీ ఎన్నుకున్నారు.రైల్వే స్టేషన్ లో చాయ్ అమ్మిన వ్యక్తిని ఇదే యువకులు ప్రధానిని చేశారు.
అలాంటి యువకుల పట్ల ఇదేనా మీ చిత్తశుద్ది.అలాంటి యువత గురించి నిర్ణయం తీసుకునే ముందు చట్ట సభల్లో చర్చించి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది.
అగ్నిపత్ స్కీమ్ దేశ భద్రతను ప్రమాదంలో నెట్టింది.ఈ హడావిడి నిర్ణయం వల్ల కోట్లాది మంది యువకులు దేశానికి భద్రత లేదని భావించి ఆందోళన బాట పట్టారు.
అగ్నిప్రత్ పథకంలో నాలుగు సంవ్సరాలు పని చేసి ఇంటికి వెళ్తే కనీసం మాజీ సైనికుడు హోదా కూడా దక్కక పోవడం దారుణం.ఈ స్కీమ్ వల్ల యువకులు అడ్డా మీద కూలిల్ల పని చేసి ఇంటికి వెళ్లవలసిందే.
ఈ స్కీమ్ లో సైనికుడిగా పని వచ్చిన యువకుడికి కనీస పెన్షన్ అవకాశం ఉండదు.ఇలాంటి చర్యలు వల్ల నైపుణ్యం లేని యువకులు యుద్ధం లో పాల్గొంటే ఒడి పోయే అవకాశం ఉంటుంది.
గతంలో రెండు సంవత్సరాల కటిన శిక్షణ ఉండేది.ఈ శిక్షణ వల్ల సైనికులు మానసికంగా సిద్ధం అయ్యేవారు.
ఇపుడు అరు నెలలో కాలంలో యువత ఏం ట్రైనింగ్ తీసుకుంటుంది.జీవితంలో అడుగు పెట్టక ముందే ఈ స్కీం వల్ల యువత భవిష్యత్ ముగుస్తుంది.అనాలోచిత చర్యల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.కాబట్టి ఈ స్కీం ను పునసమీక్ష చేసుకోవాలి.
ఈ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి.రద్దు చేసిన ఆర్మీ పరీక్ష తిరిగి పెట్టాలి.
ప్రస్తుతం రెండు లక్షల జవాన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.ప్రతి సంవత్సరం 60 వేల నియామకాలు జరగల్సి ఉండింది.
ఆ నియామకాలు కూడా అగిపోయేవి.రిమాండ్ లో చాలామంది ఆందోళన కారుల్లో ఎస్సీ ఎస్టీలు పిల్లలు ఎక్కువగా ఉన్నారు.
సికింద్రబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన అల్లలర్లో అరెస్ట్ చేసిన విషయం తల్లిదండ్రులు తెలియదు.స్టేషన్లో జరిగిన విదేశం 307 సెక్షన్ల పెట్టారు.
హత్యాయత్నం కేసు ఎలా పెట్టారు.అసలు చంపాలి అనుకున్నది ఎవర్ని పోలీసులు స్పష్టం చేయాలి.
ఈ కేసులో నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఎలా పెడతారు.రైల్వే స్టేషన్లో కేవలం నిరసనకు మాత్రమే మేము వెళ్ళాము అని పిల్లలు అంటున్నారు.
విధ్వంసం సృష్టించిన వారు వేరే ఉన్నారు.
అమాయకులను జైల్లో పెట్టారు.
ఇంత గుడ్డిగా ఎలా 307 ipc ఎలా పెడతారు.ఈ సెక్షన్ల ప్రకారం ఇంకెన్నడు వాళ్లకు ఉద్యోగాలు రావు.
ఈ దేశంలో యువకులకు ఇచ్చే నజరానా ఇదేనా.కోట్లాది మంది యువకుల తరపున నిలబడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.
నరేంద్ర మోడీ తీసుకు వచ్చిన దిక్కు మాలిన ఈ అగ్నిపత్ రద్దు చేయిస్తాం.మళ్ళీ ఆందోళన కారులకు ఉద్యోగాలకు అర్హత సాధించేలా చూస్తాం.
రాకేష్ అనే యువకుడు చనిపోతే టీఆర్ఎస్ నేతలు ఆ శవన్ని మోశారు.రాజకీయంగా రాజేష్ మరనాన్ని వాడుకున్నారు.
ఈ విద్వంసం లో గోపాల పురం పీఎస్ స్టేషన్లో రెండు fir లు కట్టింది ఈ ప్రభుత్వం.
కేసీఆర్ విద్యార్థులను మోసం చేయడానికి చచ్చిన శవం కాడా పేలాలు ఏరుకున్నడు.
అరెస్ట్ అయినా వారి తరపున న్యాయవాదులను నియమించి బెయిల్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం.తల్లిదండ్రులకు అండగా ఉంటాం.
రాష్ర్ట ప్రభుత్వం పెట్టిన కేసులను వెంటనే రద్దు చేయాలి.మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం న్యాయ సహాయం చేయాలి.
ఈ కేసులో విచారణ ఆలస్యం అయితే వారి భవిష్యత్ దెబ్బ తింటుంది.వెంటనే కేసుల విచారణ జరగాలి అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి.40 రోజుల్లో విచారణ ముగించాలి.అర్హత సాధించిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలి.307 లాంటి కేసులను ఉపసంహరించుకోవాలి.