టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.కాగా ప్రభాస్(Prabhas) నటిస్తున్న వాటిలో సిద్దార్థ్ ఆనంద్ రూపొందించనున్న సినిమా కూడా ఒకటి.
అయితే పాన్ ఇండియన్ స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను ఎవరు నిర్మించనున్నారు అనే విషయమై క్లారిటీ వచ్చింది.ఈ సినిమాను బయిట అందరు చెప్పుకుంటున్నట్లు కేవలం మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) మాత్రమే కాకుండా మరో రెండు టాప్ ప్రొడక్షన్ హౌసెస్ లు నిర్మించనున్నారు.
మరి ఆ టాప్ రెండు ప్రొడక్షన్ హౌస్ లో ఏవి అన్న విషయానికి వస్తే.

కదా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్(Siddharth Anand) ప్రస్తుతం బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఫైటర్ సినిమాను చేస్తున్నాడు.సినిమా అనంతరం ప్రభాస్ తో కలిసి సినిమాను తెరకెక్కించనున్నారు సిద్ధార్థ్ ఆనంద్.అయితే ఇప్పటికే ఈ ప్రాజెక్టు కన్ఫర్మ్ అని మైత్రి మూవీస్ అధినేతలు క్లారిటీ ఇచ్చారు.
అయితే ఈ సినిమా నిర్మాణంలో మైత్రీ మూవీస్ తో పాటు యువీ క్రియేషన్స్(UV Creations), యష్ రాజ్ ఫిల్మ్స్ (Yash Raj Films)వారు కూడా ఉండబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నా.కాగా దాదాపుగ 1500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది.
ఇదే నిజమైతే ఇండియన్ సినిమా హిస్టరీలోనే తొలిసారి ఇంత భారీ బడ్జెట్ సినిమా అవుతుందని చెప్పవచ్చు.

మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.ఆది పురుష్, సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్, కే లాంటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉండగా ఇప్పటికీ సలార్ సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
హీరో ప్రభాస్ ఒక సినిమా తెరకెక్కక ముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నాడు
.






