తెలుగు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

సినిమాకు ప్రాణం సంగీతం.హీరో, దర్శకుడు ఎంత ముఖ్యమో.అంతే ముఖ్యం సంగీత దర్శకుడు.

సినిమా జయాపజయాలను మ్యూజిక్ ప్రభావితం చేస్తుంది.సినిమా బాగా లేకపోయినా.

అద్భుత పాటల ద్వారా విజయం అందుకున్నవి ఎన్నో ఉన్నాయి.సినిమాకు కీలకమైన మ్యూజిక్ డైరెక్టర్లు ఈ మధ్య రెమ్యునరేషన్ బాగా పెంచారు.

దేవి శ్రీ ప్రసాద్ లాంటి దర్శకులు హీరోలతో సమానంగా తీసుకుంటున్నారు.మిగతా సంగీత దర్శకులు సైతం కోట్ల రూపాయలు అందుకుంటున్నారు.

Advertisement
Music Directors Remunerations In Tollywood, Music Directors, Tollywood, Top Musi

ఇంతకీ తెలుగు ఇండస్ట్రీలోఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం.

దేవీ శ్రీ ప్రసాద్

Music Directors Remunerations In Tollywood, Music Directors, Tollywood, Top Musi

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సినిమాకు మ్యూజిక్ అందిస్తే సినిమా సగం హిట్ అయినట్లే భావిస్తారు దర్శకనిర్మాతలు.ఈ మధ్యే ఉప్పెన సినిమాకు దేవి పాటలు ప్రాణంగా నిలిచాయి.పలు సినిమాలు సైతం మ్యూజికల్ హిట్స్ అందుకున్నాయి.ఈయన ఒక్కో సినిమాకు 2.75 నుంచి 3 కోట్లు వరకు తీసుకుంటున్నారు.

థమన్

Music Directors Remunerations In Tollywood, Music Directors, Tollywood, Top Musi

తెలుగులో దేవి కంటే ఎక్కువ దూసుకుపోతున్న సంగీత దర్శకుడు థమన్.అల వైకుంఠపురంలో విజయం తర్వాత రేట్ పెంచేసారు.పెరిగిన రేంజ్‌కు తగ్గట్లుగానే సినిమాకు కోటిన్నర వరకు ఛార్జ్ చేస్తున్నారు తమన్.

అనిరుధ్ రవి చందర్

Music Directors Remunerations In Tollywood, Music Directors, Tollywood, Top Musi

సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్.అనిరుధ్ ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు తీసుకుంటున్నారు.

ఏఆర్ రెహమాన్

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
సూపర్ స్టార్ మహేష్ బాబు నయా లుక్ వైరల్.. ఈ లుక్ మాత్రం అదిరిపోయిందిగా!

తమ సినిమాకు రెహమాన్ సంగీతం అందిస్తున్నారంటే గౌరవంగా చెప్పుకుంటారు దర్శక నిర్మాతలు.హీరోలు కూడా అలాగే ఫీల్ అవుతుంటారు. ఆస్కార్‌తో పాటు గ్రామీ అవార్డులు కూడా సొంతం చేసుకున్న ఈ దిగ్గజ సంగీత దర్శకుడు ఒక్కో సినిమాకు 7 నుంచి 10 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు.

ఎంఎం కీరవాణి

Advertisement

తెలుగులో వందల సినిమాలకు సంగీతం అందించిన దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి.రాజమౌళి సినిమాతో ఈయన రేంజ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది.ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోటిన్నర వరకు తీసుకుంటున్నాడు.

మణి శర్మ

ఈ సంగీత దర్శకుడు ఇప్పుడు బిజీ అయిపోయారు.ఇస్మార్ట్ శంకర్ తర్వాత మణిశర్మ రేంజ్ మారిపోయింది.ఒక్కో సినిమాకు కోటి వరకు తీసుకుంటున్నారు ఈయన.

గోపీ సుందర్

గీత గోవిందం, నిన్ను కోరి, మజిలి లాంటి సినిమాలతో పాపులర్ అయిన గోపీ సుందర్ కూడా ఒక్కో సినిమాకు 60 లక్షలు తీసుకుంటున్నాడు.

అనూప్ రూబెన్స్

గోపాలా గోపాల, టెంపర్ లాంటి భారీ సినిమాలకు సంగీతం అందించిన రూబెన్స్.ప్రస్తుతం ఒక్కో సినిమాకు 40 లక్షల వరకు అందుకుంటున్నారు.

మిక్కీ జే మేయర్

ప్రభాస్, నాగ్ అశ్విన్ లాంటి భారీ సినిమాకు సంగీతం అందించే అవకాశం అందుకున్నారు మిక్కీ జే మేయర్.మహానటి, సీతమ్మ వాకిట్లో లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.ఈయన ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.70 లక్షలు ఎర్న్ చేస్తున్నాడు.

తాజా వార్తలు