దేశవ్యాప్తంగా భారీ వర్షాలు( Heavy rains ) కురుస్తున్న సంగతి తెలిసిందే.దీంతో దేశంలో చాలా రాష్ట్రాలలో వరదలు ఏరులై పారుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయి.యమునా నది పొంగిపొర్లుతు ఉంది.
ఇక ఇదే రీతిలో తెలంగాణలో సైతం.గత మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.
భారీ వర్షాలు నేపథ్యంలో.గురు, శుక్రవారం.
రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా మరో 24 గంటల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో.
జూలై 22వ తారీకు శనివారం అనగా రేపు కూడా రాష్ట్రంలో అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం.ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ( Education Principal Secretary ) జూలై 22 అన్ని విద్యాసంస్థలకు సెలవు అని జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.వాయవ్య బంగాళాఖాతం దాని నానుకుని ఉన్న ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేయడం జరిగింది.దీంతో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళరాదని అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.







