వైట్లకు ఒక హీరో దొరికాడట!

దూకుడు చిత్రం తర్వాత శ్రీనువైట్లతో సినిమాలు చేసేందుకు అందరు హీరోలు ఆసక్తి చూపించారు.దూకుడు తర్వాత ఈయన చేసిన బాద్‌షా, ఆగడు, బ్రూస్‌లీ, మిస్టర్‌, అమర్‌ అక్బర్‌ ఆంటోనీ సినిమాలు దారుణంగా ఫ్లాప్‌ అయ్యాయి.

 Tollywood Young Hero Give The Chance To Srinu Vaitla-TeluguStop.com

దాంతో సినిమాల్లో ఈయన ఉంటాడా లేదా అనే అనుమానం కలిగింది.పట్టువదలని విక్రమార్కుడి తరహాలో నిర్మాతగా మారి స్వయంగా తన సినిమాను తానే నిర్మించేందుకు సిద్దం అయ్యాడు.

Telugu Agadu, Dhukudumahesh, Srinu Vaitla, Srinuvaitla, Tollywoodyoung-Movie

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీనువైట్ల దర్శకత్వంలో కొత్త మూవీ సమ్మర్‌లో ప్రారంభం కాబోతుందట.ఒక యంగ్‌ స్టార్‌ హీరో ఈయనకు డేట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లుగా సమాచారం అందుతోంది.వరుసగా ఫ్లాప్‌ల్లో ఉన్నా కూడా శ్రీనువైట్ల తనకు గతంలో ఛాన్స్‌ ఇచ్చాడు కనుక ఆ హీరో ఈసారి రివర్స్‌లో ఛాన్స్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట.త్వరలోనే సినిమా అధికారిక ప్రకటన రాబోతుంది.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.

Telugu Agadu, Dhukudumahesh, Srinu Vaitla, Srinuvaitla, Tollywoodyoung-Movie

ఆ హీరో ప్రస్తుతం మరో సినిమాలో నటిస్తున్నాడు.అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత హీరో ఎవరు అనేది తెలుస్తుందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.పెద్ద ఎత్తున సినిమాను నిర్మించకుండా ఒక సింపుల్‌ బడ్జెట్‌తో సినిమాను పూర్తి చేయాలని దర్శకుడు వైట్ల భావిస్తున్నాడు.

ఈసారి సక్సెస్‌ కొడితే మళ్లీ స్టార్‌ హీరోలు పిలిచి మరీ అవకాశం ఇస్తారని వైట్ల ఆశ పడుతున్నాడు.మరి అలా అయ్యేనా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube