రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసిన రవితేజ.. ఎన్ని కోట్లంటే?

ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ హిట్ తో ఫామ్ లోకి వచ్చారు.

వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రవితేజ సత్తా చాటుతున్నారు.

రవితేజ తన 71వ సినిమాకు ఏకంగా 18 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.కరోనా సెకండ్ వేవ్ తర్వాత సినిమాలకు హిట్ టాక్ వచ్చినా ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు వల్ల భారీస్థాయిలో కలెక్షన్లు రావడం లేదు.

మరోవైపు ఫ్యామిలీలు సైతం థియేటర్లలో సినిమాలను చూడటానికి గతంలోలా ఆసక్తి చూపించడం లేదు.అయితే సమస్యలు ఎన్ని ఉన్నా స్టార్ హీరోలు మాత్రం రెమ్యునరేషన్ విషయంలో వెనుకడుగు వేయడం లేదు.

క్రాక్ సినిమా తర్వాత మార్కెట్ పెరగడం వల్లే మాస్ మహారాజ్ ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తోంది.రవితేజ నటించిన ఖిలాడీ మూవీ త్వరలో థియేటర్లలో రిలీజ్ కానుంది.

Advertisement

మరోవైపు రామారావు ఆన్ డ్యూటీ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమాలతో పాటు రవితేజ సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఒక సినిమా, నక్కిన త్రినాధరావు డైరెక్షన్ లో మరో సినిమాలో నటించనున్నారు.ఈ సినిమాలతో పాటు టైగర్ నాగేశ్వరరావు బయోపిక్లో నటించడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

రవితేజకు ఏకంగా 18 కోట్ల రూపాయలు ఇస్తే ఈ సినిమా బడ్జెట్ 50 కోట్ల రూపాయలకు చేరే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

అయితే కరోనా సెకండ్ వేవ్ తర్వాత నిర్మాతలకు ఏ సినిమా కూడా భారీగా లాభాలను ఇవ్వడం లేదు.రవితేజ సినిమాపై ఈ స్థాయి బడ్జెట్ నిర్మాతలకు వర్కౌట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..
Advertisement

తాజా వార్తలు