ఆ ఆస్పత్రి నుంచి రూపాయి లాభం తీసుకోని బాలయ్య.. నిజంగా దేవుడంటూ?

స్టార్ హీరో బాలయ్య చాలా విషయాలలో ఇతర హీరోలకు భిన్నంగా ఉంటారు.రియల్ లైఫ్ లో సింపుల్ గా ఉండటానికి ఇష్టపడే హీరోలలో బాలయ్య ఒకరు.

 Tollywood Star Hero Balakrishna Great Nature Details Here Goes Viral In Social M-TeluguStop.com

అభిమానుల విషయంలో సైతం బాలయ్య ఎంతో కేరింగ్ గా వ్యవహహరిస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.ప్రస్తుతం వరుసగా మాస్ మసాలా సినిమాలలో నటిస్తున్న బాలకృష్ణ ఈ ఏడాది దసరాకు అనిల్ రావిపూడి డైరెక్షన్( Anil Ravipudi ) లో తెరకెక్కుతున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

విజయదశమికి ఆయుధపూజ అంటూ తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని బాలయ్య ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఒకవైపు బాలయ్య హీరోగా, పొలిటీషియన్ గా బిజీగా ఉన్నప్పటికీ బసవతారం ఆస్పత్రికి( Basavatarakam Hospital ) సంబంధించిన బాధ్యతలు సైతం బాలయ్యపై ఉన్నాయి.ఇండియాలోని బెస్ట్ ఆస్పత్రులలో ఈ ఆస్పత్రి కూడా ఒకటి.

దేశంలోని చాలా ఆస్పత్రులు లాభాపేక్షతో పని చేస్తుండగా బాలయ్య ( Balakrishna )ఈ ఆస్పత్రి నుంచి రూపాయి లాభం కూడా ఆశించడం లేదని ఆస్పత్రి ద్వారా వచ్చిన డబ్బులను సైతం మెరుగైన సౌకర్యాల కోసం ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.బాలయ్య సన్నిహితుల నుంచి ఈ సమాచారం అందుతోంది.ఈ విషయం తెలిసిన నెటిజన్లు బాలయ్య గ్రేట్ అని మెచ్చుకుంటున్నారు.

రాబోయే రోజుల్లో బాలయ్య ఖాతాలో మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లు చేరే ఛాన్స్ అయితే ఉంది.సేవా గుణం విషయంలో బాలయ్య దేవుడని సంపాదించడం కంటే ఇతరుల కోసం తన వంతు సహాయం చేస్తూ ఖర్చు చేసే విషయంలో బాలకృష్ణ ముందుంటారని మరి కొందరు చెబుతున్నారు.బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.

బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ( Mokshagna ) సినీ ఎంట్రీ ఈ ఏడాదే ఉండనుందని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube