హీరోలు కావాలని సింగింగ్ కెరీర్ కొలాప్స్ చేసుకున్నదెవరో తెలుసా?

ఒక్కోసారి కొన్ని కావాలంటే మరికొన్ని వదులుకోవాలి అంటారు.అయితే లేనిదాని కోసం ప్రయత్నించి ఉన్నదాన్ని కూడా కోల్పోయారు కొందరు సెలబ్రిటీలు.

ప్లే బ్యాక్ సింగర్లుగా కెరీర్ మొదలు పెట్టి.వెండితెరపై హీరోలుగా సత్తా చాటాలి అనుకున్నారు.

అయితే ఒకటి అనుకుంటే మరొకటి అయ్యింది.అటు హీరోలుగా రాణించలేకపోయారు.

ఇటు సింగింగ్ కెరీర్ కోల్పోయారు.రెంటికి చెడిన రేవడిలో తయారయ్యారు.

Advertisement
Tollywood Singers Spoiled Their Career , Srirama Chandra, Devi Sri Prasad, Saand

ఇంతకీ ఇలా ప్రయత్నించి ఫెయిల్ అయిన వ్యక్తులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

*సాందీప్

Tollywood Singers Spoiled Their Career , Srirama Chandra, Devi Sri Prasad, Saand

సింగర్ గా జనాల మనసుల్లో నిలిచిపోయాడు సాందీప్.ప్లే బ్యాక్ సింగర్ గా మంచి అవకాశాలు వస్తున్న సమయంలోనే హీరో కావాలి అనుకున్నాడు.ప్రేమాయణమః సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

తొలి సినిమా ఫర్వాలేదు అనిపించాడు.ఆ తర్వాత ఇంకోసారి, టైగర్ అనే సినిమాలు చేశాడు.

ఈ రెండూ పెద్దగా విజయం సాధించలేదు.అటు సినిమాల్లో బిజీ ఉండటం మూలంగా సింగింగ్ కెరీర్ ను పక్కన పెట్టాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

దీంతో మంచి అవకాశాలను కోల్పోయాడు.ఇటు హీరోగా సక్సెస్ కాలేదు.

Advertisement

అటు సింగింగ్ కెరీర్ కోల్పోయాడు సాందీప్.

*రాజేష్

మరో యంగ్ సింగర్ రాజేష్.మంచి అందగాడు.ఎలాగైనా సినిమాల్లోకి రావాలి అనుకున్నాడు.

ఏవీఎస్ దర్శకత్వంలో ఓరి నీ ప్రేమ బంగారం కానూ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.

కన్నడలో కూడా రెండు సినిమాలు చేసినా సక్సెస్ కాలేదు.దీంతో అటు సింగింగ్, ఇటు యాక్టింగ్ కెరీర్ నాశనం అయ్యింది.

*శ్రీ రామచంద్ర

మరో గాయకుడు శ్రీ రామచంద్ర కూడా తన కెరీర్ ను ఎటూ కాకుండా చేసుకున్నాడు.ఇండియన్ ఐడియల్ కాంపిటీషన్ లో నెగ్గిన ఈ శ్రీరామ చంద్రుడు.హీరో కావాలి అనుకున్నాడు.

ప్రేమా గీమా జాన్తా నై అనే సినిమాలో హీరోగా చేసి సక్సెస్ కాలేకపోయాడు.

*దేవి శ్రీ ప్రసాద్

టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కూడా హీరోగా సత్తా చాటాలి అనుకున్నాడు.త్వరలో పలానా సినిమాలో హీరోగా చేస్తున్నాడు అనే వార్తలు వచ్చినా.వాస్తవం కాలేదు.

తన మ్యూజిక్ కెరీర్ కు ఎలాంటి ఇబ్బంది తెచ్చుకోవద్దని అటు వైపుగా అడుగులు వేయలేదు.

*ఆర్ పి పట్నాయక్

మరో సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ హీరోగా చేయాలనుకున్నాడు.శీను వాసంతి లక్ష్మి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.ఈ సినిమా మంచి విజయం సాధించింది.

పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు.

కానీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.

తాజా వార్తలు