యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై టాలీవుడ్ పెద్దలు కోపంగా ఉన్నారా.. అదే తప్పంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చిన్న వయస్సులోనే బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే రికార్డులను సొంతం చేసుకుని ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు.కొన్నేళ్ల పాటు ఫ్లాపులు ఎదురైనా మళ్లీ సరైన కథలను ఎంచుకుని తారక్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు.

 Tollywood Seniors Not Happy With Junior Ntr Details Here Goes Viral  ,tollywood-TeluguStop.com

ప్రస్తుతం తారక్ సినిమాలు బయ్యర్లకు కళ్లు చెదిరే రేంజ్ లో లాభాలను అందిస్తుండటంతో పాటు తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లన్నీ పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ కానున్నాయి.అయితే తారక్ చేసిన ఒక్క పని టాలీవుడ్ పెద్దలకు కోపం తెప్పిస్తోందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

కొన్నిరోజుల క్రితం అమిత్ షా కోరిక మేరకు తారక్ ఆయనను ప్రత్యేకంగా కలిసిన సంగతి తెలిసిందే.ఈ సమావేశంలో రాజకీయాలకు సంబంధించిన చర్చలు జరిగాయని బీజేపీ తరపున ప్రచారం చేయాలని అమిత్ షా తారక్ ను కోరారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి.

అయితే అమిత్ షాను తారక్ కలవడంతో కేసీఆర్ సర్కార్ ఇప్పటివరకు టాలీవుడ్ ఫ్రెండ్లీగా ఉండగా తొలిసారి బ్రహ్మాస్త్రం ఈవెంట్ విషయంలో భారీ షాకిచ్చారు.భవిష్యత్తులో మరిన్ని టాలీవుడ్ సినిమాలకు సైతం కేసీఆర్ సర్కార్ నుంచి షాకులు తప్పవని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఈ నెల 2వ తేదీన అనుమతులు క్యాన్సిల్ అయిన తర్వాత టాలీవుడ్ సినీ ప్రముఖులు టీ.ఆర్.ఎస్ నేతలకు ఫోన్లు చేసినా ఫలితం లేకుండా పోయిందని తెలుస్తోంది.

Telugu Amit Shah, Amith Sha, Ntr, Telengana-Movie

జూనియర్ ఎన్టీఆర్ తప్పు లేకపోయినా టాలీవుడ్ పెద్దలు తారక్ పై ఆగ్రహంతో ఉన్నారని బోగట్టా.అయితే తారక్ పై డైరెక్ట్ గా కామెంట్లు చేయడానికి మాత్రం ఎవరూ సాహసించడం లేదు.దర్శకధీరుడు రాజమౌళి వల్లే బ్రహ్మాస్త్రం ఈవెంట్ కు తారక్ హాజరవ్వాలని అనుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

టాలీవుడ్ విషయంలో కేసీఆర్ సర్కార్ కూల్ కావాలని టాలీవుడ్ పెద్దలు కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube