వెంకటేష్, నాగార్జున పనైపోయిందా ?

సీనియర్ హీరోలలో చిరంజీవి, బాలకృష్ణ తరువాత వెంకటేష్, నాగార్జునకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

ఫ్యామిలీ ఆడియన్స్ లో తిరుగులేని ఇమేజ్ విక్టరీ వెంటకేష్ సొంతం.

అలాగే యూత్ లో కింగ్ నాగార్జున క్రేజ్ మామూలుగా ఉండేది కాదు.అయితే ఇదంతా ఒకప్పటి మాట.ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున సినిమాల పట్ల ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపడం లేదా అంటే ఈ మద్య వారి నుంచి వచ్చిన సినిమాలను పరిశీలిస్తే అవుననే సమాధానాలు వినిపిస్తాయి.2016లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన తరువాత కింగ్ నాగార్జున కు ఒక్క హిట్ కూడా నమోదు కాలేదు.రాజు గారి గది 2, మన్మథుడు 2, ఆఫీసర్, వైల్డ్ డాగ్, ఈ గత ఏడాది వచ్చిన ఘోస్ట్.

ఇలా నాగ్ నటించిన మూవీస్ అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి.దాంతో నాగార్జున తదుపరి సినిమాలపై కూడా పెద్దగా క్రేజ్ తగ్గిందా ? అనే సందేహం రాక మానదు.ఇక విక్టరీ వెంకటేష్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన " f2 " తరువాత సరైన విజయం దక్కలేదు.ఆ మూవీ కూడా మల్టీ స్టారర్ కావడంతో మూవీ విజయంలో సగం క్రెడిట్ వరుణ్ తేజ్ కు వెళ్లిపోయింది.

Advertisement

ఇక తరువాత వచ్చిన " వెంకీమామ " యావరేజ్ గా నిలిచినప్పటికి దృశ్యం 2, నారప్ప వంటి సినిమాలు ఓటిటికే పరిమితం అయ్యాయి.ఇక గత ఏడాది సమ్మర్ లో వచ్చిన f3 కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో విజయం దక్కలేదు.దీంతో వెంకీ సినిమాలపై కూడా ఆడియన్స్ లో క్యూరియాసిటీ తగ్గుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.అయితే వెంకటేష్ నాగార్జున లతో పోలిస్తే మరో సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ

తమ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ వారి సినిమాలతో అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతున్నారు.దీంతో సాధారణంగానే నాగ్, వెంకీ లపై కాస్త ఒత్తిడి ఉందనే చెప్పవచ్చు మరి ఈ ఇద్దరు హీరోలు వారి తరువాతి సినిమాలతోనైనా అదిరిపోయే విజయాలను నమోదు చేస్తారేమో చూడాలి.ప్రస్తుతం వెంకటేష్ శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ అనే మూవీ చేస్తున్నాడు.

ఇక నాగార్జున.తన తనయుడు అఖిల్ చేయబోయే నెక్స్ట్ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020
Advertisement

తాజా వార్తలు