తెలుగు ఇండస్ట్రీ మళ్లీ పూర్వ వైభవాన్ని సంపాదించుకుంది కరోనా వైరస్ కారణంగా గత కొంత కాలంగా సినిమాలు విడుదలవడం కష్టంగా ఉన్న సమయం నుంచి ఇక ఇప్పుడు థియేటర్లకు ప్రేక్షకులు తరలి వెళ్ళే పరిస్థితి వచ్చింది.దీంతో ఇక ప్రస్తుతం వరుసగా తమ సినిమాలను విడుదల చేస్తున్న ఎంతోమంది బ్లాక్బస్టర్ విజయాలను సాధిస్తున్నారూ అని చెప్పాలి.
ఇక ఇలాంటి సమయంలోనే అటుసినిమాలను ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా చేయాల్సిన నిర్మాతలు.ప్రేక్షకులకు సినిమాని భారంగా మార్చేస్తున్నారు.
టికెట్ రేట్లను ఒక్కసారిగా పెంచేస్తూ ఉన్నారు.దీంతో సగటు అభిమాని ఫ్యామిలీతో పాటు సినిమా థియేటర్కు వెళ్లి సినిమా చూడటం అంటే ఖర్చు మొత్తం తడిసి మోపెడవుతుంది అనే చెప్పాలి.
దానికి తోడు థియేటర్లలో ఇంటర్వెల్ సమయంలో పాప్ కార్న్ కూల్ డ్రింక్ కి అదనపు ఖర్చులు అనే చెప్పాలి.ఇలా నేటి రోజుల్లో సినిమా ప్రేక్షకులకు భారంగా మారి పోతుంది అయినప్పటికీ త్రిబుల్ ఆర్, కే జి ఎఫ్ లాంటి భారీ అంచనాల ఉన్నా సినిమాలకు ఖర్చు లెక్కచేయకుండా తరలివెళుతున్నారు ప్రేక్షకులు.
కానీ ఇక కేజిఎఫ్ త్రిబుల్ ఆర్ సినిమాలకు లాగానే తమ సినిమాలకు కూడా భారీ రేట్లు పెడతానంటే ప్రేక్షకులు అస్సలు అంగీకరించడంలేదు.

ఈ క్రమంలోనే ఆచార్య, సర్కార్ వారి పాట లాంటి సినిమాలకు ఎక్కువ రేటు ఉండటంతో సినీమాకు వెళ్లాలా వద్దా అని తెగ ఆలోచిస్తున్నారు అని తెలుస్తోంది.కొంతమంది ఓటీటీ లో విడుదలయ్యాక చూద్దాంలే అంటూ సైలెంట్ గానే ఉండి పోతున్నారు.తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న అసలు విషయాన్ని నిర్మాత దిల్ రాజు అర్థం చేసుకున్నాడు అనేది అర్థం అవుతుంది.
ఎందుకంటే దిల్ రాజు నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఎఫ్ 3 సినిమాకు టికెట్ రేట్లు పెంచడం లేదని స్పష్టం చేశారు.దీంతో అత్యాశకు ఆశకు మధ్య తేడా ఆయన అర్థం చేసుకున్నారు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.







