సాధారణంగా ఇండస్ట్రీలో హిట్టు కొట్టడం అనేది చాలా కష్టం.ఇక మొదటి సినిమాతోనే హిట్ కొట్టడం అంటే పంచభూతాలు కనికరించాలి ఇక అన్నీ కలిసి వస్తే అటు మొదటి సినిమా సాధించడం లాంటివి జరుగుతూ ఉంటుంది అయితే ఇటీవలి కాలంలో ఎంతో మంది యువ హీరోలు అదృష్టవంతులుగానే కనిపిస్తున్నారు.
మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంటున్నారు.ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత మాత్రం ఎలాంటి కథలు చేయాలి ప్రేక్షకులు తమ నుంచి ఏమి ఆశిస్తారో అన్నది అర్థం కాక తర్జనభర్జన పడిపోతున్నారు.
అలాంటి హీరోలు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవలే డీజే టిల్లు సినిమాతో సెన్సేషన్ సృష్టించిన సిద్దు జొన్నలగడ్డ అట్లే ఉంటది మనతోని ముచ్చట అంటూ యూత్ అందరిని కూడా ఆకర్షించాడు.
ఇక ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫై దృష్టి పెట్టాడు ఈ క్రమంలోనే మలయాళం హిట్ కపెల రీమేక్‌లో చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదట.ఇక ఆచితూచి అడుగులు వేస్తూ కెరీర్ నిలబెట్టుకోవడానికి భయ పడుతున్నాడట.
ఫలక్‌నుమా దాస్ అనే సినిమాతో హీరోగా డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు విశ్వక్సేన్.

ఇక ఆ తర్వాత హిట్ సినిమాతో మరో హిట్ కొట్టాడు.ఇక ఇప్పుడు అశోకవనంలో అర్జున కళ్యాణం తో ప్రేక్షకులను అలరించబోతున్నారు.వీటితో పాటు మిగతా సినిమాల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాడూ.
ఈ క్రమంలోనే లేడీస్ నైట్, దాస్ కి దమ్కి, ఓరి దేవుడా ఇలాంటి సినిమాల్లో నటిస్తున్నాడు.జాతి రత్నాలు సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ సృష్టించిన హీరో నవీన్ పోలిశెట్టి జాతి రత్నాలు తరువాత మరో సినిమాకు సైన్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు.

ఈ యువహీరో తనకు కలిసొచ్చిన కామెడీ జోనర్ లోని సినిమాలకు రెడీ అయ్యాడు.సీనియర్ హీరోయిన్ అనుష్క తో కలిసి శెట్టి మిస్టర్ పొలిశెట్టిలో నటిస్తున్నాడు.ఆర్ఎక్స్ 100 తో ఆ ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయిన కార్తికేయ ఇక ఇప్పుడు హీరోగా విలన్ గా నటిస్తున్నాడు.కానీ క్లిక్ అవ్వలేక పోతున్నాడు.
ఇప్పుడు అడ్వెంచర్ జోనర్లో మరో కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాడు అన్నది తెలుస్తుంది.







