1970 మరియు 1980లల్లో ఎక్కువగా మల్టీస్టారర్ చిత్రాలు వచ్చేవి.అంతకు ముందు కూడా ఎన్టీఆర్, ఏయన్నార్‌లు మల్టీస్టారర్‌లు చేశారు.
అయితే 1990 నుండి మల్టీస్టారర్ చిత్రాలు అనేవే లేకుండా పోయాయి.చిన్న చితక హీరోల మల్టీస్టారర్ చిత్రాలు కూడా ఆ మద్య రాలేదు.
ఎట్టకేలకు మళ్లీ మల్టీస్టారర్ ట్రెండ్ మొదలైంది.స్టార్ హీరోలు మల్టీస్టారర్ చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అయితే అందుకు తగ్గ కథలు మరియు నిర్మాతలు సిద్దంగా లేరని మొన్నటి వరకు విమర్శలు ఉండేవి.కాని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం తర్వాత ఆ విమర్శలకు తెర పడ్డట్లయ్యింది.
ఏ ముహూర్తాన దిల్‌రాజు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాన్ని మహేష్‌బాబు మరియు వెంకటేష్‌లతో నిర్మించాడో కాని అప్పటి నుండి వరుసగా మల్టీస్టారర్ చిత్రాలు వస్తూనే ఉన్నాయి.త్వరలో ఇంకా ఈ మల్టీస్టారర్ చిత్రాల జోరు పెరిగే అవకాశం కనిపిస్తుంది.
ప్రస్తుతం తెలుగులో అతి పెద్ద మల్టీస్టారర్ చిత్రానికి రాజమౌళి రంగం సిద్దం చేస్తున్నాడు.ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్‌లు కలిసి ఆమల్టీస్టారర్‌లో నటించబోతున్నారు.
భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఆ మల్టీస్టారర్‌ను 2020లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.అంతుకు ముందే పలు మల్టీస్టారర్ చిత్రాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి.

అతి త్వరలోనే అంటే సెప్టెంబర్‌లో నాగార్జున మరియు నానిలు కలిసి నటిస్తున్న ‘దేవదాస్’ అనే మల్టీస్టారర్ చిత్రం విడుదల కాబోతుంది.ఆ తర్వాత వెంకటేష్ మరియు వరుణ్ తేజ్‌లు కలిసి నటిస్తున్న ‘ఎఫ్ 2’ చిత్రం విడుదల అయ్యే అవకాశాలున్నాయి.ఇక చిన్న హీరోలు కలిసి నటిస్తున్న పలు మల్టీస్టారర్ చిత్రాలు కూడా విడుదలకు రెడీ అవుతున్నాయి.ఈ సమయంలోనే దిల్‌రాజు మరో మల్టీస్టారర్ చిత్రానికి రంగం సిద్దం చేశాడు.
ఇటీవలే ‘సమ్మోహనం’ చిత్రంతో విమర్శకుల మరియు ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకున్న మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లుగా దిల్‌రాజు అధికారికంగా ప్రకటించాడు.త్వరలోనే ఈ మల్టీస్టారర్ హీరోలను ప్రకటించనున్నట్లుగా దిల్‌రాజు చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న మల్టీస్టారర్ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ పైకి తీసుకు వెళ్లబోతున్నట్లుగా దిల్‌రాజు ప్రకటించాడు.ప్రస్తుత సమయంలో ఒక్క మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించడమే కష్టం అనుకుంటున్న సమయంలో వరుసగా మల్టీస్టారర్ చిత్రాు నిర్మిస్తూ ఉన్న నిర్మాత దిల్‌రాజు ఒకేసారి రెండు మల్టీస్టారర్ చిత్రాలను పట్టాలపైకి తీసుకు వెళ్లబోతున్నాడు.
ఈ రెండు మల్టీస్టారర్‌ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు మరిన్ని మల్టీస్టారర్ చిత్రాలు వస్తాయనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.







