మొన్నటికి మొన్న చెప్పుకున్నాం .తమిళ్ సంగీత దర్శకుల హావ తెలుగు లో బాగా పెరిగిపోయిందని.
ఒకప్పుడు థమన్ లేదా సేవి శ్రీ ప్రసాద్ అన్నట్టుగా కొన్నేళ్ల పాటు హావ కొనసాగిన ఆ ట్యూన్స్ బోర్ కొట్టిస్తున్నాయి.అందుకే తెలుగు లో చిన్న సినిమాల నుంచి పెద్ద చిత్రాల వరకు ప్రస్తుతం చాల మంది డైరెక్టర్స్ పక్క బాషల నుంచి సంగీత దర్శకులను దింపేస్తున్నారు.మరి వేరే బాషల నుంచి వచ్చిన ఆ సంగీత దర్శకులు ఎవరు, ఏ హీరోలకు ఎవరు మ్యూజిక్ కొడుతున్నారు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
అనిరుద్ రవిచంద్రన్

తమిళ్ సంగీత ప్రపంచంలో అనిరుద్( Anirudh Ravichander ) ఒక అద్భుతం .రజిని నుంచి అజిత్, విజయ్ అనే తేడా లేకుండా ప్రస్తుతం అందరికి సంగీతం అందిస్తూ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతన్నాడు.ఇక తెలుగు లో కొరటాల శివ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ముప్పయ్యవ సినిమా కు అలాగే విజయ్ దేవరకొండ నటిస్తున్న 12 వ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.
సంతోష్ నారాయణన్

దసరా సినిమా తర్వాత తెలుగు లో మంచి సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందారు తమిళ సంగీత దర్శకుడు అయినా సంతోష్ నారాయణన్.ఈ సినిమా తర్వాత ప్రస్తుతం తెలుగు లో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న ప్రాజెక్ట్ K చిత్రానికి మరియు వెంకటేష్ తన కెరీర్ లో నటిస్తున్న 75 వ సినిమా సైంధవ్ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
రవి బస్రుర్
ఇక ప్రభాస్ నటిస్తున్న మరొక సినిమా సలార్ కోసం రవి బస్రుర్ అనే కన్నడ సినిమా సంగీత దర్శకుడు పని చేస్తున్నారు.
హిషామ్ అబ్దుల్ వాహబ్

మలయాళం నుంచి హిషామ్ అబ్దుల్ వాహబ్( Hesham Abdul Wahab ) మొదటి సారి తెలుగు లో నాని 30వ సినిమాకు మరియు విజయ దేవరంకొండ, సమంత నటిస్తున్న ఖుషి చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు.
జి వి ప్రకాష్
తమిళ్ లో పాపులర్ సంగీత దర్శకుడు అయినా సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ తెలుగు లో రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.భీష్మ డైరెక్టర్ తో మరోమారు జత కడుతూ నితిన్ చేస్తున్న సినిమాకు అలాగే హీరో వైష్ణవ తేజ్ తదుపరి చిత్రం కోసం సంగీతం అందిస్తుండటం విశేషం.
అజనీష్
విరూపాక్ష( Virupaksha ) మరియు కస్టడీ సినిమాలకు సంగీతం అందించిన కన్నడ సంగీత దర్శకుడు అజనీష్ తెలుగు లో మరి కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ తో ముందుకు వస్తున్నాడు.నితిన్, వక్కంతం వంశి సినిమా తో పాటు, విశ్వక్ సేన్ 11 వ సినిమాకు, పాయల్ రాజపుత్ మెయిన్ లీడ్ గా వస్తున్న మంగళవారం వంటి చిత్రాలకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండటం విశేషం.







