విడుదలైన రోజు సూప‌ర్ హిట్ టాక్ కానీ తర్వాత అట్టర్ ఫ్లాప్, యావ‌రేజ్ గా నిలిచిన సినిమాలు!

సినిమాలు ఒక్కోసారి మాయ చేస్తాయి.కొన్ని సార్లు సినిమాలు హిట్ టాక్ వస్తాయి.

కానీ, ఫట్ అవుతాయి.మరికొన్ని సార్లు ఫ్లాప్ టాక్ వచ్చి సక్సెస్ అవుతాయి.తెలుగు ఇండస్ట్రీలో మొదట్లో హిట్ టాక్ వ‌చ్చి ఫ్లాప్ , యావ‌రేజ్ గా నిలిచిన చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం! మెగాస్టార్ చిరంజీవి ఖాతాలోను ఇలాంటి సినిమాలు ఉన్నాయి.1992లో వచ్చిన ఆపద్బాంధవుడు తొలుత సూపర్ హిట్ అనే టాక్ వచ్చింది.చివరకు ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.2006లో వచ్చిన ఈ స్టాలిన్ సినిమా మొదట్లో మంచి టాక్ వచ్చింది.చివరకు యావరేజ్ గా నిలిచింది.2019లో వచ్చిన సైరా సినిమా మంచి హిట్ పొందుతుంది అనుకున్నారు .కానీ అంతంత మాత్రంగానే ఆడింది.బాలకృష్ణ‌ కెరీర్ లోనూ ఇలాంటివి ఉన్నాయి.

కృష్ణబాబు సినిమా విడుదలైన అన్ని చోట్ల మంచి టాక్ తెచ్చుకుంది.ఆ తరువాత సినిమా అంతగా ఆడలేదు .మిత్రుడు సినిమా కూడా మంచి టాక్ తో వ‌చ్చి అలాగే వచ్చి ప్లాప్ అయ్యింది.

Tollywood Movies Which Are Flops Even Though They Had A Good First Day Talk, Bil

నాగార్జున సినిమాల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి.ఎదురులేని మనిషి విడుదలైన మొదటి రోజు మంచి సినిమాగా టాక్ వచ్చింది.చివరగా ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

Advertisement
Tollywood Movies Which Are Flops Even Though They Had A Good First Day Talk, Bil

రాజన్న సినిమా కూడా మొదట్లో మంచి టాక్ వ‌చ్చింది.కానీ చివరకు యావ‌రేజ్ గా నిలిచింది.

వెంకటేష్ హీరోగా వచ్చిన సినిమాలు సైతం ఇలాంటి టాక్ తెచ్చుకున్నాయి.శ్రీను, దేవిపుత్రుడు సినిమాలకు గుడ్ టాక్ వ‌చ్చింది.

కానీ చివరకు ఫ్లాప్ అయ్యాయి.పవన్ కళ్యాణ్ నటించిన బాలు, అన్న‌వ‌రం సినిమాలు సైతం బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకున్నాయి.

చివరకు యావ‌రేజ్ సినిమాలుగా నిలిచాయి.

Tollywood Movies Which Are Flops Even Though They Had A Good First Day Talk, Bil
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

సూపర్ స్టార్ మహేబాబు బాబీ, నిజం సినిమాలు సైతం ఇలాంటి టాక్ తెచ్చుకున్నాయి.మొదట మంచి టాక్ వ‌చ్చింది.కానీ చివరకు నిరాశ పరిచాయి.

Advertisement

సింహాద్రి సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ సినిమాల‌పై అంచనాలు భారీగా నెలకొన్నాయి.దీంతో సాంబ‌, ఆశోక్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

సాంబకు ఎంతో పాజిటివ్ టాక్ వచ్చినా ప్లాప్ అయ్యింది.

ప్రభాస్ సినిమాలు రాఘవేంద్ర, బిల్లా సైతం ఇలాగే అయ్యాయి.రాఘ‌వేంద్ర ఫ్లాప్ కాగా, బిల్లా యావ‌రేజ్ గా నిలిచింది.బిల్లాకు ఓ రేంజ్ ప్రచారం వచ్చింది.

విడుదల అయిన తర్వాత హిట్ టాక్ వ‌చ్చింది.ఫైన‌ల్ గా యావ‌రేజ్ గా నిలిచింది.

రామ్ చరణ్ గోవిందుడు అందరివాడేలే, బ్రూస్లీ సినిమాలు సైతం ఇదే కోవకి చెందినవి.ఈ సినిమాలు విడుద‌లై మంచి టాక్ తెచ్చుకున్నాయి.

కానీ గోవిందుడు అందరివాడేలే మామూలుగా నడిచింది.బ్రూస్లీ ఫ్లాప్ అయ్యింది.

అల్లు అర్జున్ బద్రీనాథ్ మూవీ సైతం ఊరించి ఉత్తది చేసింది.ఈ సినిమాపై మగధీర రేంజ్ అంచనాలు వచ్చాయి.చివరకు బద్రీనాథ్ సినిమా యావ‌రేజ్ గా ఆడింది.

తాజా వార్తలు