టాలీవుడ్ నిర్మాతల మండలి ఆ మధ్య థియేటర్లను కాపాడుకోవడం కోసం డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను కాపాడుకోవడం కోసం సినిమాలు థియేటర్ లో విడుదలైన 50 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయాలి అంటూ నిర్ణయానికి వచ్చిన విషయం తెలిసిందే.అప్పటి వరకు కమిట్ అయిన సినిమాలు కాకుండా కొత్తగా చేయబోతున్న సినిమాలు.
ఇక ముందు అగ్రిమెంట్ అవ్వబోతున్న ప్రతి సినిమా కూడా థియేటర్ రిలీజ్ అయినా 50 రోజుల తర్వాత మాత్రమే ఏదైనా ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసుకోవచ్చు అంటూ నిర్మాతల మండలి గైడ్లైన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే.కానీ ఆ నిర్ణయం ఏ ఒక్క నిర్మాత కూడా పాటిస్తున్నట్లు కనిపించడం లేదు.
చిన్న నిర్మాతలు మాత్రమే కాకుండా పెద్ద నిర్మాతలు కూడా ఆ నిర్ణయాన్ని గాలికి వదిలేశారు.ఎన్నో సినిమాలు విడుదలైన మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీ కి వచ్చేస్తున్నా కూడా పెద్ద నిర్మాతలు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు.

నిర్మాతల మండలి ఈ విషయం లో సైలెంట్ గా ఉండడం తో పెద్ద నిర్మాతలు కూడా తమ సినిమాలను కూడా ఓటీటీలో విడుదల చేసే విషయంలో ఆ కండిషన్ ని తుంగలో తొక్కిస్తున్నారు.50 రోజుల తర్వాత మాత్రమే విడుదల చేయాలి అనే రూల్ ఉన్నప్పటికీ చాలా మంది నిర్మాతలు దాన్ని పట్టించుకోక పోవడంతో మరో సారి నిర్మాతల మండలి మీటింగ్ ఏర్పాటు చేసి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది అంటూ కొందరు ఇండస్ట్రీ కి చెందిన వారు మాట్లాడుకుంటున్నారు.థియేటర్లలో సినిమా చూడని వారు ఎలాగో మూడు నాలుగు వారాల్లో ఏదైనా ఓటీటీ లో వస్తుంది కనుక అనుక అక్కడే చూసేద్దాం అంటూ ఎదురు చూస్తున్నారు.అది ఏ మాత్రం ఇండస్ట్రీకి సరైనది కాదు.
ఓటీటీ లో కొత్త సినిమాల స్ట్రీమింగ్ ఇండస్ట్రీకి మంచిది కాదు అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.ఇప్పటికైనా ఇండస్ట్రీ వర్గాల వారు మరో సారి 50 రోజుల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయాన్ని కఠినంగా అమలు చేయాలని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు.







