2001 నుంచి 2007 వరకు తెలుగు బుల్లితెరపై దిగ్విజయంగా ప్రసారమైన కామెడీ సీరియల్ “అమృతం”( Amrutham Serial ) గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.అప్పట్లో ప్రేక్షకులు ఈ సీరియల్ వస్తుందంటే టీవీలకు అతుక్కుపోయి చూసేవారు.
ఈ సీరియల్‌లో మెయిన్ క్యారెక్టర్స్ చేసిన నరేష్, గుండు హనుమంతరావు, వాసు ఇంటూరి, నరిపెద్ది శివన్నారాయణ, ఝాన్సీ, రాగిణి సూపర్ పాపులర్ అయ్యారని చెప్పుకోవచ్చు.వీరందరూ కూడా మంచి నటులు.
అదిరిపోయే కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.ముఖ్యంగా అప్పాజీ పాత్ర( Appaji Role ) పోషించిన నరిపెద్ది శివన్నారాయణ( Naripeddi Sivannarayana ) హిలేరియస్ పంచులతో, కామెడీ టైమింగ్‌తో బాగా ఆకట్టుకున్నాడు.
అమ్మమ్మ.కామ్ టీవీ షోలో అద్భుతంగా నటించి ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును కూడా గెలుచుకున్నాడు.గ్రహణం (2004), డార్లింగ్ (2010), అమృతం చందమామలో (2014) సహా 150కి పైగా సినిమాల్లో నటించి మెప్పించాడు.చిన్నతనం నుంచి థియేటర్‌లో నటించేవాడు.
చాలా టాలెంటెడ్ అని చెప్పుకోవచ్చు.అయినా మన తెలుగు ఇండస్ట్రీ అతడిలోని నటనా నైపుణ్యాలను పెద్దగా వాడుకోలేదు.
అతడికి ఇండస్ట్రీ చిన్న పాత్రలు మాత్రమే ఇచ్చి సరి పెట్టింది.అయితే 2023 లో వచ్చిన “సౌండ్ పార్టీ” సినిమాలో( Sound Party Movie ) నరిపెద్ది శివన్నారాయణకు మంచి పాత్ర దొరికింది.

ఆ క్యారెక్టర్ పేరు కేకే అంటే కుబేర్ కుమార్. ఈ సినిమాలో హీరో, బిగ్ బాస్ ఫేమ్ వీజే సన్నీకి( VJ Sunny ) తండ్రిగా నటించాడు.కామెడీ డ్రామాగా ఈ మూవీ వచ్చింది.క్రిప్టోకరెన్సీ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.అందువల్ల ఇందులోని కామెడీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కాలేదు.అయితే శివన్నారాయణ యాక్టింగ్ మాత్రం బాగా హైలెట్ అయింది.
నిజం చెప్పాలంటే శివన్నారాయణ ఈ సినిమాని సగానికి పైగా నడిపాడు.హీరోకు, తనకు మధ్య కెమిస్ట్రీ కూడా మంచిగా పండింది.
ఈ సినిమాలో అమృతంలో చేసిన సర్వం వంటి చాలామంది ప్రతిభావంతులైన నటీనటులు ఉన్నారు.వారు కూడా బాగానే చేశారు కానీ వారందరిలో అప్పాజీ ఇరగదీసేశాడు.
అంత మంచి నటనా నైపుణ్యం ఉన్న ఈ నటుడికి తెలుగు దర్శకులు ఛాలెంజింగ్ పాత్రలు ఇవ్వకపోవడం నిజంగా అతని దురదృష్టం అని చెప్పుకోవచ్చు.

శివన్నారాయణ మూవీ ఇండస్ట్రీలో 20 ఏళ్లకు పైగానే ఉన్నాడు.చాలానే సినిమాలు చేశాడు, అయినా అతనికి దక్కాల్సిన గుర్తింపు, మంచి పాత్రలు దక్కలేదు.2023లో ఐదు తెలుగు సినిమాల్లో నటించాడు.అవన్నీ చిన్న పాత్రలు.ఈ ఏడాది భూతద్దం భాస్కర నారాయణలో సినిమాలో కనిపించాడు.ఇది మార్చి 1న రిలీజ్ అయింది, రీసెంట్‌గా ఓటీటీలో కూడా రిలీజ్ అయింది.ఇందులోనూ అతని క్యారెక్టర్ చాలా చిన్నది.