తల తెగితే సినిమా హిట్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త సెంటిమెంట్ మొదలైందా?

కొన్నేళ్ల క్రితం వరకు సినిమా ఇండస్ట్రీలో హింసాత్మక ఘటనల మోతాదు తగ్గిందనే సంగతి తెలిసిందే.అయితే ఈ ఏడాది మాత్రం తల తెగితే సినిమా హిట్ అని ఒక వెరైటీ సెంటిమెంట్ ప్రచారంలోకి వస్తోంది.

 Tollywood Industry New Sentiment Details Here Goes Viral In Social Media , Dasar-TeluguStop.com

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి సినిమా( Veerasimha Reddy movie )లో విలన్ తండ్రి తలను బాలయ్య నరికేస్తాడు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.

వాల్తేరు వీరయ్య సినిమాలో( Waltheru Veeraya movie ) కూడా క్లైమాక్స్ సీన్ లో వీరయ్య పాత్రలో నటించిన చిరంజీవి ప్రకాష్ రాజ్ పాత్ర తలను నరికేస్తాడు.ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

అయితే దసరా సినిమా( Dasara movie )లో కూడా తల తెగే సీన్లు ఏకంగా రెండు ఉంటాయనే సంగతి తెలిసిందే.ఈ రెండు సన్నివేశాలలో ఒక సీన్ ప్రేక్షకులను షాక్ కు గురి చేస్తే మరో సీన్ సర్ప్రైజ్ అయ్యేలా ఉంది.

రాబోయే రోజుల్లో కూడా పెద్ద హీరోల సినిమాలలో కూడా ఈ తరహా సన్నివేశాలు ఉండే ఛాన్స్ అయితే ఉంది.టాలీవుడ్ స్టార్ హీరోలు యాక్షన్ సీన్లకు తమ సినిమాలలో ప్రాధాన్యత పెంచుతున్నారు.ఈ సీన్ల వల్ల టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా మారి ఇతర భాషల్లో కూడా అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

టాలీవుడ్ స్టార్ హీరోల మార్కెట్ సైతం అంతకంతకూ పెరుగుతోంది.యంగ్ జనరేషన్ స్టార్ హీరోల పారితోషికం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.టాలీవుడ్ సినిమాలకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

తెలుగు సినిమాల కోసం ఇతర భాషల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తెలుగు సినిమాల మార్కెట్ ఊహించని రేంజ్ లో పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube