టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలే భవిష్యత్తు స్టార్ కిడ్స్ వీళ్లే.. వీళ్లకు ఎవరూ సాటిరారంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకుల అభిరుచి మారడంతో పాటు సెలబ్రిటీల పిల్లలు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఎంతోమంది అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అదే దిశగా అడుగులు పడుతున్నాయి.

బ్యాగ్రౌండ్, తండ్రులకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉండటం వల్ల స్టార్ కిడ్స్ కు చిన్న వయస్సులోనే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో పాటు క్రేజ్, పాపులారిటీ పెరుగుతోంది.

మోక్షజ్ఞ,( Mokshagna ) అకీరా నందన్ సినీ ఎంట్రీకి సంబంధించి ఈ మధ్య కాలంలో తరచుగా వార్తలు ప్రచారంలోకి వస్తుండగా వీళ్లిద్దరి సినిమాల షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.రాజమౌళి సినిమాతో అభయ్ రామ్ సినీ కెరీర్ మొదలవుతుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

మహేష్ రాజమౌళి సినిమాలో అక్కాతమ్ముళ్ల పాత్రలు ఉన్నాయని ఆ పాత్రలో సితార,( Sitaara ) అభయ్ రామ్ కనిపించేలా జక్కన్న డిసైడ్ అయ్యారని వార్త వినిపిస్తోంది. దేవర ( Devara )సినిమాలో సైతం కీ రోల్ లో అల్లు అర్హ( Allu Arha ) కనిపిస్తారని తర్వాత షెడ్యూల్ లో ఆమె జాయిన్ అవుతారని వినిపిస్తున్నా ఆ వార్తల్లో క్లారిటీ రావాల్సి ఉంది.

Advertisement

ఇతర సెలబ్రిటీల పిల్లలు సైతం టాలీవుడ్ ఇండస్ట్రీలో భవిష్యత్తులో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఎన్టీఆర్, మహేష్, బన్నీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను కొనసాగిస్తుండటంతో వాళ్ల పిల్లలకు కూడా ఆయా హీరోల అభిమానుల సపోర్ట్ లభిస్తోంది.అయితే సెలబ్రిటీల కిడ్స్ అయినంత మాత్రాన సక్సెస్ సాధించడం సులువు కాదు.ఎంతో టాలెంట్ ఉంటే మాత్రమే స్టార్ కిడ్స్ అయినా సినిమాలలో సక్సెస్ సాధించడం సాధ్యమవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సరైన ప్రాజెక్ట్ లతో స్టార్ కిడ్స్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?
Advertisement

తాజా వార్తలు