'సినిమా టికెట్ ధరలు పెంచడం' టాలీవుడ్ కి వరమా ? శాపమా ?

కరోనా శాపం నుండి టాలీవుడ్ పూర్తిగా కోలుకుంది అని చెప్పాలి.ఎందుకంటే కరోనా కారణంగా దాదాపుగా మూడు సంవత్సరాల వరకు సరిగా థియేటర్ లు నడపడం జరగలేదు.

 Tollywood Industry Facing Problems With Movie Tickets Tollywood, Movie Tickets ,-TeluguStop.com

దీనితో పెద్ద సినిమాల రిలీజ్ లు అన్నీ వాయిదా పడ్డాయి.అయితే గత కొంత కాలం నుండి మాత్రం టాలీవుడ్ లో పెద్ద పెద్ద సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి.

దీనితో నిర్మాతల గళ్ళ పెట్టెలు నిండుకున్నాయి.అయితే ఈ సినిమాల బడ్జెట్ ఎక్కువ కావడంతో వీరు టికెట్ ధరలు కూడా సాధారణంగా ఏమీ పెంచలేదు, భారీగా పెంచేశారు.

ఇప్పుడు టికెట్ ధరలను నిర్దేశించే అధికారం కాస్తా స్థానిక ప్రభుత్వాలు తీసుకున్న విషయం తెలిసిందే.అయితే సినిమా టికెట్ ధరలు పెంచడం సినిమాకు వరమా లేదా శాపమా అన్న కోణంలో ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి.

అయితే ఒకప్పుడిలా పరిస్థితులు లేవు, పూర్తిగా మారిపోయాయి.

కరోనా కారణంగా ఉపాధిని కోల్పోయి ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు కూడా ఉన్నారు.

అయితే గత కొద్దీ రోజుల క్రిందట రష్యా మరియు యుక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధ ప్రభావంతో నిత్యవసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి.ముఖ్యంగా పెట్రోల్ డీజిల్, ఆయిల్ వంటివి.

ఇలా బతుకుబండిని ఈడుస్తున్న సామాన్యుడు ఒక సినిమా చూడడానికి ఒక మనిషిపైన ఇంత ఖర్చు పెట్టగలడా ? ఎంత మంది అయినా పర్లేదులే అని పోతున్నారు అన్న విషయాలు ఇండస్ట్రీ అంచనా వేయడంలో విఫలం అయింది అని చెప్పాలి.గతంలో అయితే ఏదైనా ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయిందంటే… టికెట్లు దొరకడం చాలా కష్టంగా ఉండేది.

హౌస్ ఫుల్ అయిపోయేది.ఇందుకు టికెట్ దార తక్కువగా ఉండడమనే చెప్పాలి.

కానీ ఇప్పుడు పెరిగిన టికెట్ ధర కారణంగా చాలా వరకు థియేటర్ కు వెళ్లి సినిమా చూడడానికి ఆసక్తిని కనబరచడం లేదు అంటే నమ్మండి.అంతెందుకు ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ సైతం డుమ్మా కొట్టేస్తున్నారు.

Telugu Tickets, Radhyashyam, Russia, Theater, Tollywood, Ukraine-Latest News - T

ఇలా భారీ బడ్జెట్ లను పెట్టి ఎన్నో అంచనాలతో తీసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సరైన కలెక్షన్ లను తీసుకురాలేక ఫెయిల్ అవుతున్నాయి.ఫస్ట్ రోజు కూడా కలెక్షన్ లు ఒక మోస్తరుగానే ఉన్నాయి.ఇలా కొన్ని సినిమాలు ప్లాప్ లుగా మారుతున్నాయి.ఇది అంతా కూడా పెరిగిన టికెట్ దరల వల్లనే అని తెలుస్తోంది.ఇప్పుడు వస్తున్న సినిమాలు కనీసం మొదటి రోజు కూడా హౌస్ ఫుల్ అవడం లేదు.కొందరు ప్రేక్షకులు అయితే ఇన్కా కొన్ని రోజులు ఆగితే టికెట్ ధర తగ్గుతుంది కదా అప్పుడు వెళ్లి చూడొచ్చు అని ఉండిపోతున్నారు.

మరి కొందరు ఏమో అంత ధర పెట్టి పోవడం అవసరమా ? రెండు వారాలు ఆగితే ఓ టి టి లో వచ్చేస్తుందని ఆగిపోతున్నారు.ఇలా భారీగా టికెట్ ధరలను పెంచడం మూలంగా ఏవేవో కారణాలతో సినిమాకు సరైన స్థాయిలో కలెక్షన్ లు రావడం లేదు.

నిజంగా టికెట్ ధరలు పెరగడమే ఇండస్ట్రీకి ఒక శాపం అని చెప్పాలి.ఇంకెన్నాళ్లు పడుతుందో.థియేటర్ ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డు కనబడాలి అంటే?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube