టాలీవుడ్ లో ఎక్కువ ఫిల్మ్ ఫెయిర్ అవార్డ్ తీసుకున్న హీరో ఎవరు? ఈ సినిమా కి..?

తొలుత అమెరికా సినిమాలే ఇచ్చిన ఆస్కార్ అవార్డులు.ఆ త‌ర్వాత ఇత‌ర దేశాల సినిమాల‌కు సైతం ఎలా ఇస్తున్నారో.

సేమ్ అలాగే మొదట్లో బాలీవుడ్ కే పరిమితమైన ‌ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తర్వాత సౌత్ సినిమాల‌కూ ఇస్తున్నారు.తెలుగులో తొలిసారి 1972లో బడి పంతులు సినిమాకు ఎన్టీఆర్ ఈ అవార్డ్ తీసుకోగా.

చివరగా 2018లో రంగస్థలం మూవీకి రాంచరణ్ కు ఈ అవార్డ్ పొందాడు.ఈ అవార్డ్స్ ఇంతవరకు మన తెలుగు న‌టులు ఎంతమంది అందుకున్నారు? అనే విష‌యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం! తెలుగులో ఎక్కువ సార్లు ఈ అవార్డు పొందిన వ్య‌క్తి మెగాస్టార్ చిరంజీవి.త‌న‌కు 7 సార్లు ఈ అవార్డు ద‌క్కింది.

శుభలేఖ, విజేత, ఆపద్భాంధవుడు , ముఠా మేస్త్రి , స్నేహం కోసం, ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలకు అవార్డులు గెలుచుకున్నాడు.చిర‌జీవి తర్వాత 5 సార్లు ఈ అవార్డు పొందాడు మహేష్ బాబు .

Advertisement

ఒక్కడు , పోకిరి, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు , శ్రీమంతుడు సినిమాలకు 5 ఫిల్మ్ ఫెయిర్ అవార్డులు ద‌క్కించుకున్నాడు.శోభన్ బాబు, విక్టరీ వెంకటేష్ చెరో నాలుగు సార్లు ఈ అవార్డును పొందారు.

కార్తీక దీపం, సోగ్గాడు , జీవన జ్యోతి , ఖైదీ బాబాయ్ సినిమాలకు శోభన్ బాబు ఈ అవార్డులు పొంద‌గా.బ్రహ్మపుత్రుడు, ధర్మచక్రం, గణేష్, జయం మనదేరా సినిమాలకి వెంకటేష్ ఫిల్మ్ ఫెయిర్ అవార్డులు ద‌క్కించుకున్నాడు.

నాగేశ్వరరావు , కృష్ణం రాజు, కమల్ హాసన్ , అల్లు అర్జున్ మూడు సార్లు ఈ అవార్డులు పొందారు .మరుపురాని మనిషి, ఆత్మ బంధువులు , సీతారామయ్య గారి మనవరాలు సినిమాలకు నాగేశ్వ‌ర్‌రావు పొంద‌గా.అమర దీపం , తాండ్ర పాపారాయుడు, బొబ్బిలి బ్రాహ్మన్న సినిమాలకు కృష్ణంరాజు అందుకున్నాడు.

ఆకలి రాజ్యం , సాగర సంగమం , ఇంద్రుడు చంద్రుడు సినిమాలకు కమల్ హాసన్ ద‌క్కించుకున్నాడు.పరుగు, వేదం, రేసుగుర్రం సినిమాలకు అల్లు అర్జున్ ఈ అవార్డులు పొందాడు.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

రాజ‌శేఖ‌ర్, జూ.ఎన్టీఆర్, రాంచ‌ర‌ణ్ కు రెండు చొప్పున అవార్డులు ద‌క్కాయి.అన్న , మగాడు , సినిమాలకు రాజశేఖర్ అవార్డులు పొంద‌గా.

Advertisement

యమదొంగ , నాన్నకు ప్రేమతో సినిమాలకు ఎన్టీఆర్ ద‌క్కించుకున్నాడు.మగధీర , రంగస్థలంకు రాంచరణ్ ఈ అవార్డులు అందుకున్నారు.

బడి పంతులు సినిమాకి ఎన్టీఆర్.అన్నమయ్య మూవీకి నాగార్జున.పెదరాయుడు సినిమాకి మోహన్ బాబు .పదహారేళ్ళ వయసుకి చంద్రమోహన్.శంకరాభరణం సినిమాకి సోమయాజులు.

గబ్బర్ సింగ్ కి పవన్ కళ్యాణ్ .నువ్వు నేను మూవీకి ఉదయ్ కిరణ్.నువ్వొస్తానంటే నేనోదంటాన సినిమాకి సిద్ధార్ధ .అర్జున్ రెడ్డి మూవీకి విజయ్ దేవరకొండ ఒక్కో అవార్డు పొందారు.‌.

తాజా వార్తలు