ఒక హీరో హీరోయిన్ కాంబినేషన్ లో సినిమా వచ్చి ప్రేక్షకులను ఆకర్షించి మంచి విజయం సాధించింది అంటే చాలు ఇక అదే కాంబినేషన్ మరికొన్ని సినిమాల్లో రిపీట్ చేయడానికి ఇష్టపడుతుంటారు దర్శకనిర్మాతలు. అంతేకాదు ఇక హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయితే అటు ప్రేక్షకులకు నచ్చింది అంటే ఇక ఆ హీరో హీరోయిన్ల కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవ్వడం కూడా చూస్తూ ఉంటాము.
ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఇలాంటి కాంబినేషన్ రిపీట్ అవుతున్నాయి.ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దిల్రాజు నిర్మాణంలో పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హీరోగా విభిన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది.అయితే ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది.
ఇక వీరిద్దరూ కలిసి వినయ విధేయ రామ సినిమాలో నటించారు.ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కియారా చరణ్ కెమిస్ట్రీ మాత్రం ప్రేక్షకులకు కనెక్ట్ అయింది.
దీంతో ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుంది.

కీర్తి సురేష్ – నాని :
కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.ఇక నాచురల్ స్టార్ నాని వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను పలకరించపోతున్నాడు.అయితే విభిన్నమైన కథాంశంతో తెరకెక్కినా దసరా అనే సినిమాలో నటిస్తున్నాడు నాని.
ఇక ఈ సినిమాలో నేను లోకల్ సినిమా తో హిట్ కాంబినేషన్ గా నిలిచిన కీర్తి సురేష్ తోనే మళ్ళి జతకట్టబోతున్నాడు.

మహేష్ బాబు – పూజా హెగ్డే :
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమా మంచి విజయాన్ని సాధించింది.ఈ సినిమాలో పూజ హెగ్డే మహేష్ బాబు జంటగా నటించారు.ఇక ఈ హిట్ కాంబినేషన్ మరోసారి త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో రిపీట్ చేయబోతున్నారు.

చిరంజీవి- కాజల్ అగర్వాల్ :
చిరంజీవి కాజల్ అగర్వాల్ ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించారు.ఇక వేరే హీరోయిన్లు దొరక్కపోవడంతో మళ్ళీ ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ ని పెట్టుకున్నాడు చిరంజీవి.ఇక మరోవైపు సైరా నరసింహారెడ్డి సినిమాలో తనతో కలిసి నటించిన తమన్నాను గాడ్ ఫాదర్ సినిమాలో హీరోయిన్గా పెట్టుకున్నాడు అనే విషయం తెలిసిందే.

గోపీచంద్ – రాసి కన్నా : జిల్ అనే సినిమాతో వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను అలరించింది.ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.చాలా ఏళ్ల తర్వాత మారుతీ దర్శకత్వం లో వస్తున్నా పక్కా కమర్షియల్ సినిమాలో గోపీచంద్ సరసన నటిస్తుంది రాసి కన్నా.
ఇలా తమ హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ చేస్తున్నారు హీరోలు దర్శకనిర్మాతలు.







