కరోనా బేఖాతర్.. విదేశాల్లో తెలుగు హీరోల షూటింగ్స్..ఎవరేక్కడ చేస్తున్నారు ?

కరోనా తర్వాత టాలీవుడ్ మళ్లీ బాగా బిజీ అయ్యింది.పలువురు హీరోలు వరుస బెట్టి సినిమాలు చేస్తున్నారు.

కరోనా ప్రభావం కాస్తో కూస్తో ఉన్నా పెద్దగా పట్టించుకోవడం లేదు.పాన్ఇండియన్ స్టార్ ప్రభాస్ కరోనా అనేది ఒకటి ఉందని కూడా లెక్కలోకి తీసుకోవడం లేదు.

రాధేశ్యాస్ సినిమా కోసం యూరోపిన్ దేశాలను చుట్టేసి వస్తున్నాడు.మహమ్మారిని లెక్క చేయకుండా ఆది పురుష్, సలార్, నాగ్ అశ్విన్ సినిమాలు చేతున్నాడు.

ప్రస్తుతం నాగ్ అశ్విన్ తో కలిసి ప్రభాస్ ప్రాజెక్ట్ కె అనే షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.ఆయనతో పాటు దీపికా పదుకొనె, అమిత్ బచ్చన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు.

Tollywood Heros Dont Care About Corona , Tollywood Heros , Corona , S Dont Care
Advertisement
Tollywood Heros Dont Care About Corona , Tollywood Heros , Corona , S Dont Care

కరోనా మూడో దశ కొనసాగుతున్నా చిరంజీవి, బాలకృష్ణ, రామ్ చరణ్, ఎన్టీఆర్, నాగార్జున, వెంకటేష్ వరుస సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు.చిరంజీవి ఏకంగా అర డజన్ సినిమాలను లైన్లో పెట్టాడు.ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాల షూటింగ్ ఏక కాలంలో కొనసాగుతుంది.

అటు ఆయన తాజా మూవీ ఆచార్య ఏప్రిల్ 29న విడుదలకు రెడీ అయ్యింది.అటు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ షెడ్యూల్ రెడీ అయ్యింది.అటు రాంచరణ్.శంకర్ దర్శకత్వంలో ఆర్సీ-15 సినిమా చేస్తున్నాడు.15 రోజుల పాటు ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ పూర్తి కానుంది.

Tollywood Heros Dont Care About Corona , Tollywood Heros , Corona , S Dont Care

అటు రవితేజ తన తాజా సినిమా ధమాకాతో బిజీగా ఉన్నాడు.త్రినాధరావు తెరకెక్కిస్తున్న ఈసినిమా షూటింగ్ సారథి స్టూడియోలో కొనసాగుతుంది.ఈ సినిమాతో పాటు రామారావ్ ఆన్ డ్యూటీ అనే సినిమాను కూడా చేస్తున్నాడు రవితేజ.

అటు కల్యాణ్ రామ్ .రాజేంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుంది.

న్యూస్ రౌండప్ టాప్ 20

అటు తమిళ హీరో ధనుష్.వెంకీ అట్లూరి దర్శకత్వం లో సర్ సినిమా చేస్తున్నాడు.

Advertisement

ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో కొనసాగుతుంది.

ధనుష్ కు ఈ మధ్య కరోనా నిర్ధారణ కావడంతో షూటింగ్ కు కాస్త బ్రేక్ పడింది.

తాజా వార్తలు