కరణ్ జోహార్( Karan Johar ) అంటే బాలీవుడ్ లోనే కాదు ఇండియా మొత్తం ఫేమస్.ఆయన పేరు చెబితే సినిమా ఇండస్ట్రీ లో ఏ పనైనా అయిపోతుంది అనే భావనలో ఉంటారు.
ముఖ్యంగా ఆయనకు తెలియకుండా బాలీవుడ్ లో ఏ చిత్రం కూడా జరగదు.స్టార్ కిడ్స్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారు అనే పేరు కూడా ఉంది.
అయితే కరణ్ జోహార్ లాంటి ఒక బాలీవుడ్ ఐకాన్ స్టార్ కి టాలీవుడ్ హీరోలు ఎందుకో హ్యాండ్ ఇస్తూనే వస్తున్నారు.కరణ్ జోహార్ కి డైరెక్టర్ గా కన్నా ప్రొడ్యూసర్ గానే ఎక్కువ సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి.
ప్రస్తుతం ఆయన ప్రొడక్షన్ హౌస్ లో మన తెలుగు సినిమా హీరోలను నటింప చేయాలనే భావనలో ఆయన ఉన్నప్పటికీ ఎందుకో ఆయనను మన వాళ్ళు పెద్దగా పట్టించుకోవడం లేదు.
బాహుబలి సినిమా విజయం సాధించిన తర్వాత ప్రభాస్( Prabhas ) తో కరణ్ జోహార్ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్ లో ఒక సినిమా చేయించాలని అనుకున్నారు.అందుకోసం డిస్కషన్స్ కూడా జరిగాయి.కొన్ని మీటింగ్స్ అయిన తర్వాత ఎందుకో ఈ సినిమా వర్క్ అవుట్ అవ్వకపోవడంతో ప్రభాస్ వేరే ప్రాజెక్టుతో బిజీ అయిపోయారు.
ఇక సలార్ సినిమా చేస్తున్న టైంలో కూడా కరణ్ జోహార్ తన ప్రొడక్షన్ హౌస్ కోసం ఒక చిత్రాన్ని చేసి పెట్టమని అడిగారట.ఆ టైంలో అప్పటికే సలార్ కమిట్ అయ్యారు.
మరో రెండు మూడు సినిమాలు కమిటై ఉన్నారు.కాబట్టి అప్పుడు కూడా ప్రభాస్ చేయలేని పరిస్థితి వచ్చిందట.
మొత్తంగా ప్రభాస్ కరణ్ జోహార్ కి సినిమా చేయడానికి ఒప్పుకోలేకపోయాడు.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మరోసారి కరణ్ జోహార్ తెలుగు సినిమా హీరోల వైపు మొగ్గు చూపారు.మన దేవర స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చెయ్యాలని భావించారు.కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాకి తారక్ నటిస్తున్నాడు.
ఈ సినిమాని నార్త్ లో కరణ్ జోహార్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు.ఈ సారి దేవర తర్వాత తారక్ కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ లో ఓ సినిమా తీస్తాడని అందరూ అనుకున్నప్పటికి దేవరా తరవాత దానికి సీక్వెల్ ఉంది.
ఇక వార్ 2 తో పాటు మరో మూడు నాలుగు సినిమాలకు ఇప్పటికే తారక్ కమిట్ అయి ఉన్నాడు.మరి ఇవ్వన్నీ పూర్తయి తారక్ కరణ్ జోహార్ కి ఎప్పుడు డేట్స్ ఇస్తాడు.
అందుకే టాలీవుడ్ హీరోలు ఎవరు కూడా ఇప్పుడు కరణ్ జోహార్ తో పని చేసే పరిస్థితులు లేవు.