చీర కట్టులో మెరిసిపోతున్న టాలీవుడ్ హీరోయిన్స్...

ఒకప్పుడు సినిమా హీరోయిన్లు అంటే.చక్కటి చీర కట్టుకుని అందంగా ముస్తాబయ్యేవారు.కానీ ఇప్పుడు హీరోయిన్లు అంటే.

ఎంత చిన్న బట్టలు వేసుకుంటే అంత క్రేజ్ లా ఫీలవుతున్నారు.అంతేకాదు.సినిమా నిర్మాతలు, దర్శకులు కూడా చిన్న చిన్న గుడ్డ పీలికలు వేసుకునే భామలకే తమ సినిమాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు.

చక్కటి సంప్రదాయంగా కనిపించే వారికి ఆఫర్లు ఇవ్వడం లేదనే విమర్శలూ వినిపిస్తున్నాడు.అయితే కొందరు హీరోయిన్లు మాత్రం ఎంత బిజీగా ఉన్నా.

చక్కటి చీరలు ధరిస్తూ అప్పుడప్పుడూ దర్శనం ఇస్తున్నారు.పట్టు చీరల్లో ఒద్దికగా ఒదిగిపోయి వారెవ్వా అనిపిస్తున్నారు.

Advertisement

తమిళమ్మాయి సాయి పల్లవి, ముంబై భామ పూజా హెగ్డే.కన్నడ కస్తూరి రష్మిక మందాన అందమైన చీరల్లో మరింత అందంగా మెరిసిపోతున్నారు.

తమ లేలేత అందాలను చూపించి చూపించనట్లు చేస్తూ కుర్రకారుకు వెర్రెత్తిస్తున్నారు.పలు వేదికలపై అద్భుతమైన శారీలతో దర్శనం ఇచ్చారు ఈ ముద్దుగుమ్మలు.

తాజాగా లైట్ బ్లూ డిజైన్ సారీలో తళుక్కున మెరిసింది సాయిపల్లవి.చీర వల్ల తనకు కాదు.

తనవల్లే చీరకు అందం వచ్చింది అనేలా ఉంది.రష్మిక మందాన కూడా డార్క్ బ్లూ కలర్ లంగావోణీ వేసుకుంది.

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!
సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?

చక్కటి నవ్వుతో మరింత అందాన్ని అద్దుకుంది ఈ ముద్దుగుమ్మ.అచ్చ తెలుగు అమ్మాయే అనేలా కనిపించింది ఈ కన్నడ భామ.పూజా హెగ్డే సైతం ఆకుపచ్చ రంగు చీరలో మెరిసిపోయింది.మ్యాచింగ్ బ్లౌజ్, డిజైన్ నెక్లెస్ తో అదుర్స్ అనిపించింది.

Advertisement

ప్రస్తుతం ఈ ముగ్గురు హీరోయిన్లు పలు సినిమాల్లో బిజీగా ఉన్నారు.పూజా హెగ్డే రాధేశ్యామ్, ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల్లో నటిస్తుంది.అటు దళపతి విజయ్ తో బీస్ట్, రణ్ వీర్ సింగ్ తో సిర్కస్ అనే సినిమాలో చేస్తుంది.

అటు సల్మాన్ మూవీకి కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.సాయి పల్లవి విరాటపర్వం, లవ్ స్టోరీ సినిమాలు చేస్తుంది.అటు రష్మిక పుష్పతో పాటు బాలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తుంది.

తాజా వార్తలు