ఇతర రాష్ట్రాల డైరెక్టర్లకు ఓటేస్తున్న టాలీవుడ్ హీరోలు.. ఆ దర్శకులు నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా?

టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం తమ సినిమాల మార్కెట్ ను పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నారు.

ఇతర భాషల్లో సైతం తమ సినిమాలు సక్సెస్ సాధిస్తే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తాయని భావిస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోలలో మెజారిటీ స్టార్ హీరోలు ఇదే దారిలో పయనిస్తున్నారు.చిరంజీవి( Chiranjeevi ) మోహన్ రాజా( Mohan Raja ) కాంబోలో ఇప్పటికే గాడ్ ఫాదర్ తెరకెక్కగా ఈ కాంబోలో మరో సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

నాగార్జున( Nagarjuna ) తమిళ డైరెక్టర్ నవీన్ కు ఓకే చెప్పారని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం నాగ్ నటిస్తున్న కూలీ లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది.

ప్రభాస్( Prabhas ) లోకేశ్ కనగరాజ్( Lokesh Kanagaraj ) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని జోరుగా వార్తలు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే.కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్( Prasanth Neel ) డైరెక్షన్ లో ప్రభాస్ సలార్2 సినిమాలో నటించనున్నారు.

Tollywood Heroes Vote For Other Language Directors Details, Chiranjeevi, Mohan R
Advertisement
Tollywood Heroes Vote For Other Language Directors Details, Chiranjeevi, Mohan R

ఎన్టీఆర్( NTR ) ప్రస్తుతం అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో నటిస్తుండగా ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు.ఎన్టీఆర్ ఒక తమిళ డైరెక్టర్ కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి.రామ్ చరణ్( Ram Charan ) ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మంచు విష్ణు బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.

Tollywood Heroes Vote For Other Language Directors Details, Chiranjeevi, Mohan R

సత్యదేవ్ నటించి ఈ నెల 22వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న జీబ్రా సినిమాకు ఈశ్వర్ కార్తీక్ దర్శకునిగా పని చేశారు.ఈ డైరెక్టర్ తమిళ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే.అయితే ఈ డైరెక్టర్లలో ఎంతమంది డైరెక్టర్లు టాలీవుడ్ స్టార్ హీరోలకు హిట్లు ఇస్తారో చూడాల్సి ఉంది.

టాలీవుడ్ హీరోల మార్కెట్ ను ఈ డైరెక్టర్లు పెంచుతారో లేదో అనే చర్చ సైతం జరుగుతోంది.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు