తెలుగులో చాలామంది నటులు చాలా మంది డైరెక్టర్లు గా మరుతున్నరల సినిమాలని డైరెక్షన్ చేసి మంచి మంచి విజయాలను దక్కించుకుంటున్నారు.అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరూ కూడా దాదాపు ప్రొడ్యూసర్లుగా( Producers ) మారిన వారే వాళ్ళు ఎవరు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం… మొదట గా అక్కినేని నాగార్జున ని( Akkineni Nagarjuna ) తీసుకుంటే ఈయన అన్నపూర్ణ స్టూడియోస్ అనే బ్యానర్ మీద సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు.
ఈయన చేసిన నిన్నే పెళ్ళాడుతా, మనం లాంటి సినిమాలను కూడా వీళ్ళ బ్యానర్ లోనే నిర్మించడం జరిగింది.
బయట హీరోల సినిమాలను కూడా వాళ్ళ బ్యానర్లో చేస్తూ ఉంటారు.
నాగార్జున హీరోగా రాణిస్తూనే ఇటు ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ సాధించాడు…ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో నాని( Nani ) ఒకరు…ఆయన మంచి సినిమాలు చేస్తుకుంటునే నటుడుగా మంచి గుర్తింపుని సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.ప్రస్తుతం ఆయన దసరా అనే సినిమాతో మంచి సక్సెస్ సాధించి ప్రస్తుతం సక్సెస్ లో ఉన్నాడు.

ఇక ఇప్పుడు వరుసగా రెండు మూడు సినిమాలు కూడా చేస్తున్నాడు ఇక ఈయన ఇటు హీరోగా రాణిస్తూనే, అటు ప్రొడ్యూసర్ గా కూడా మంచి హిట్లను అందుకుంటున్నాడు.ఈయన ప్రొడ్యూసర్ గా వీళ్ల బ్యానర్ లో వచ్చిన మొదటి సినిమా అ…( Awa Movie ) ఈ సినిమా తో ప్రశాంత్ వర్మ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఇక సినిమా ఇచ్చిన సక్సెస్ తో నాని శైలేశ్ కొలను అనే కొత్త డైరెక్టర్ ని పరిచయం చేస్తూ ఈ బ్యానర్ లో రెండవ సినిమాగా హిట్ సినిమాని( Hit Movie ) చేశాడు ఇది కూడా మంచి విజయాన్ని అందుకుంది.

ఇక దాంతో మూడో సినిమాగా ఈ హిట్ సినిమాని తీసిన శైలేష్ కొలను డైరెక్షన్ లోనే హిట్ సినిమాకి సీక్వెల్ తీసి మంచి విజయాలను అందుకున్నాడు.ఇక మొదటి పార్ట్ లో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తే, రెండోవ పార్ట్ లో అడవి శేషు హీరోగా నటించాడు.మొత్తానికి ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి…ఇక నాని కూడా ప్రొడ్యూసర్ గా మంచి సక్సెస్ లు సాధించాడు…
.