ఒక సినిమా తీయాలంటే ఏళ్లకు ఏళ్ళు టైం పెట్టాలి.అలాగే దానికి తగ్గట్టుగా పారితోషకం కూడా ఉంటుంది.
కానీ ఆ సినిమా పరాజయం పాలైతే ఆ తర్వాత వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించలేం.అందుకే డబ్బులు సంపాదించాలంటే సినిమా తీస్తే మాత్రమే సరిపోదు అప్పుడప్పుడు యాడ్స్( Ads ) చేసి కోట్లు వెనకేసుకుంటారు మన తెలుగు హీరోలు.
ఇందులో మహేష్ బాబు( Mahesh Babu ) లాంటి హీరోల విషయమైతే చెప్పక్కర్లేదు ఆ తర్వాత అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ వంటి హీరోలు కూడా యాడ్స్ బాగానే చేస్తున్నారు.దాదాపు ఒక్కొక్కరి చేతిలో అరడజన్ బ్రాండ్స్ ఉన్నాయి.
వీటితో కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు.అయితే వీటిని తీస్తున్న హీరోలే కోట్లు సంపాదిస్తున్నారు.
అలాగే వీటిని తరికెక్కిస్తున్న వారు కూడా కోట్ల కొద్ది సొమ్ము చేసుకుంటున్నారు.

హీరోలతో సినిమాలు మాత్రమే కాదు మేము యాడ్ ఫిలిమ్స్( Ad Films ) కూడా తెరకెక్కిస్తాము అంటున్నారు మన టాలీవుడ్ దర్శకులు. ఇలా నాలుగైదు రోజుల పాటు సమయం పెట్టి ఒక ఆడ్ ఫిలిమ్ తెరకేకిస్తే డబ్బులు కోట్లల్లో వస్తున్నాయి.అందుకే అటు హీరోలు ఇటు దర్శకులు సినిమాలతో పాటు సైడ్ బిజినెస్ గా ఫిలిం మేకింగ్ కూడా పెట్టుకున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో త్రివిక్రమ్( Trivikram ) ఈ రేసులో ముందున్నారు.ఆయన చాలా రోజులుగా ఈ పని చేస్తున్నారు మహేష్ బాబు నటించిన చాలా యాడ్స్ త్రివిక్రమ్ చేతిలో నుంచి వచ్చినవే.
ఆ తర్వాత ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో అనిల్ రావిపూడి( Anil Ravipudi ) మహేష్ బాబును తో ఒక యాడ్ ఫిలిం డైరెక్ట్ చేస్తున్నారు ఇందులో రాజేంద్రప్రసాద్( Rajendra Prasad ) కూడా ఉన్నారు.

వీళ్ళు మాత్రమే కాదు తరుణ్ భాస్కర్, క్రిష్, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులు కూడా సినిమాల కన్నా యాడ్ ఫిలిమ్స్ ని ఎక్కువ సంఖ్యలో షూట్ చేశారు అలాగే డబ్బు కూడా వీటి పైన ఎక్కువ వస్తున్నడంతో అందరి దృష్టి వీటి పైనే ఉంది.ఇక రానున్న రోజుల్లో చిన్న డైరెక్టర్ చేయడం కన్నా పెద్ద డైరెక్టర్ చేస్తేనే తీస్తాము అని చెప్పే టాలీవుడ్ హీరోలు కూడా ఎక్కువైపోతారు.ఇక ఎలెక్షన్స్ వస్తే ఈ యాడ్ షూట్స్ డిమాండ్ మరి ఎక్కువగా ఉంటుంది.
టీడీపీ పార్టీ కి ఎక్కువగా బోయపాటి యాడ్స్ చేసి పెడుతూ ఉంటారు.