సినిమాలతోనే కాదు సైడ్ బిజినెస్ లతోను ఇరగదీస్తున్న టాలీవుడ్ దర్శకులు.. లాభసాటి యాపారం

ఒక దర్శకుడిగా రాణించాలంటే ఎంత కష్టమో మనందరికి తెలిసిందే అసలు ఇప్పుడు మనం కాస్తో కూస్తో ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాం అంటే దానికి కారణం మనకి మంచి మంచి సినిమాలు.

అదిరిపోయే కంటెంట్ అందిస్తున్న డైరెక్టర్లదే.

అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మన తెలుగు స్టార్ డైరెక్టర్లు కొంతమంది ఒకవైపు స్టార్ హీరోలతో వన్ బై వన్ సినిమాలు చేస్తూనే మరోవైపు బిసినెస్ లు చేస్తూ రెండు చేతులా కోట్లు సంపాదిస్తున్నారు.అయితే వాళ్లెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం

1) సుకుమార్:

ఈ లిస్ట్ లో ముందున్న స్టార్ డైరెక్టర్ సుకుమార్ గారు ఈయనే ప్రెసెంట్ సైడ్ బిజినెస్‌లో అందరికంటే ముందున్నారు.ఈయన సైడ్ బిజినెస్ చిన్న చిన్న సినిమాలకి మంచి మంచి కథలను అందించడం.

కుమారి 21 ఎఫ్ నుంచి ఈయన రైటర్‌గా ఫుల్ బిజీ అయిపోయాడు.వాటితో పాటు దర్శకుడు గా కూడా అయన సినిమాలు ఆయన తీసుకుంటూ బాగానే సంపాదిస్తున్నారు.

ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న ఉప్పెన సినిమాకి కూడా కథ ఆయనే అందించారు.ఈయన దగ్గర ఇంకా ఎన్నో కథలు ఉన్నాయట.అయితే ప్రెసెంట్ సుకుమార్ గారు అల్లుఅర్జున్ తో పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు

2) పూరీ జగన్నాథ్:

Tollywood Directors Side Businesses, Sukumar Profitable Business, Puri Jagannat
Advertisement
Tollywood Directors Side Businesses, Sukumar Profitable Business, Puri Jagannat

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొక డైనమిక్ డైరెక్టర్ అయిన పూరి గారు కూడా అంతే.ఓ వైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూనే.మరోవైపు తన తమ్ముడు సాయిరాం శంకర్ కోసం కథలు రాసాడు.

అలాగే కొడుకు ఆకాశ్ కోసం కూడా ఒక రొమాంటిక్ కథ ఇచ్చాడు.అలా డైరెక్టర్ గానే కాకుండా మంచి రచయితగా కూడా సంపాదిస్తున్నాడు.

ఇక పూరి గారిలో అందరికి నచ్చే అంశం ఏమిటంటే.ఆయన డైలాగ్స్.

3) మారుతి:

Tollywood Directors Side Businesses, Sukumar Profitable Business, Puri Jagannat

ఇక దర్శకుడు మారుతీ గారు అయితే ఆయనకంటూ ఒక చిన్న సైజు సామ్రాజ్యమే సృష్టించుకున్నాడు.ఈయన దర్శకుడిగా కంటే రైటర్‌గానే ఎక్కువ బిజీగా ఉంటారు.ఈయన ఎన్నో సినిమాలకి కథలని అందించి బాగానే సంపాదించారు.

4) సంపత్ నంది:

బియ్యం పిండిని ఇలా వాడితే బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా మిలమిల మెరుస్తారు

రామ్ చరణ్ పుణ్యమా అంటూ రచ్చ సినిమాతో ఏమా క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు సంపత్ నంది.కూడా పేపర్ బాయ్, గాలిపటం లాంటి కొన్ని సినిమాలకు కథలను అందించాడు.ఇక దర్శకుడిగా కూడా బిజిగానే ఉంటాడు.ప్రస్తుతం హీరో గోపీచంద్‌తో సీటీమార్ సినిమా చేస్తున్నాడు.

5) హరీష్ శంకర్:

Advertisement

పవన్ అన్నతో గబ్బర్ సింగ్ లాంటి తోపు సినిమా నిర్మించిన డైరెక్టర్‌ హరీష్ శంకర్ కూడా ఒక రైటర్‌గా ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు.ఈయన మొదట సునీల్ కోసం రైటర్ గా మారిపోయాడు.సునీల్ హీరోగా నటిస్తున్న వేదాంతం రాఘవయ్య అనే సినిమాకు కథ అందిస్తున్నాడు హరీష్ శంకర్.

6) త్రివిక్రమ్:

ఇక త్రివిక్రమ్ సర్ గురించి చెప్పేదేముంది.ఆయన ముందు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందే రైటర్‌గానే.స్వయంవరం సినిమాతో ఒక రైటర్ గా మొదలైన ఈయన ప్రయాణం మన్మధుడు, మల్లేశ్వరి, నువ్వునాకు నచ్చావ్, చల్ మోహన్ రంగ ఇలా ఎన్నో సినిమాలకి కధలను అందించి ఆ తర్వాత దర్శకుడిగా మారాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

డైరెక్టర్ అయిన తర్వాత కూడా పవన్ తీన్‌మార్ సినిమాకు డైలాగ్స్ రాసాడు.ఇప్పుడు ఎన్టీఆర్ 30 వ సినిమాకి కథను రెడీ చేసే పనిలో ఉన్నాడు.

7) చందూ మొండేటి:

తెలుగు యంగ్ డైరెక్టర్లలో ఒకరైన చందు మొండేటి కూడా రెండు చేతులా సంపాదిస్తున్నాడు.ఈయన కార్తికేయ, ప్రేమమ్ లాంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నా కూడా తన స్నేహితుడు నిఖిల్ కోసం కిరాక్ పార్టీ సినిమాకు మాటలు రాసాడు.ఇంకా కొన్ని సినిమాలకు కథలను రెడీ చేస్తున్నాడు.

8) సుధీర్ వర్మ:

నిఖిల్ హీరోగా నటించిన స్వామి రారా సినిమాతో ఒక మంచి దర్శకుడిగా ఎంతో క్రేజ్ సంపాదించిన సుధీర్ వర్మ.నిఖిల్ నటించిన ఇంకొక సినిమా కిరాక్ పార్టీకి స్క్రీన్ ప్లే రాసిచ్చాడు.దాంతో దర్శకుడిగానే కాకుండా రచయితగా కూడా రాణిస్తున్నాడు.

9) సురేందర్ రెడ్డి:

తన అదృష్టాన్ని కాకుండా కష్టాన్ని నమ్ముకున్న దర్శకులలో సురేందర్ రెడ్డి గారు కూడా ఒకరు.సో, ఆయన ఇప్పుడు తన దగ్గర శిష్యరికం చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్స్ ని దర్శకులుగా మార్చేందుకు వాళ్లకు సహాయం చేసేందుకు ఆయనే కొన్ని కథలను తాయారు చేస్తున్నారట సో, ఇక నుండి ఈయన కూడా దర్శకుడిగానే కాకుండా స్టోరీస్ ఇచ్చే దర్శకుడిగా కూడా సంపాదిస్తున్నాడు.

తాజా వార్తలు